సీనియర్ హీరోయిన్స్ త్రిష, ఛార్మి ఇద్దరూ మంచి స్నేహితురాళ్లు. ఇద్దరు ఎక్కడ కలిసినా గంటలు తరబడి ముచ్చట్లు చెప్పుకుంటూంటారు. లేట్ నైట్ పార్టీలు ఇచ్చుకుంటూంటారు. అలాగే ఇద్దరూ ఇంకా పెళ్లిళ్లు చేసుకోలేదు. ఈ నేపధ్యంలో తాజాగా ఛార్మి ...త్రిషను ఉద్దేశించి చేసిన కామెంట్ సోషల్ మీడియాలో హాట్ గా మారింది. 

ఈ రోజు  త్రిష పుట్టిన రోజు సందర్భంగా అభిమానులతో పాటు ఆమెతో పనిచేసిన  సినీ ప్రముఖులు కూడా విషెష్ చెప్తున్నారు. అయితే దాదాపు అందరూ ఇలాంటి పుట్టిన రోజులు మరెన్నో జరుపుకోవాలని అంటూంటే...వారందిరీకీ భిన్నంగా చార్మీ ఓ డిఫరెంట్ మెజేజ్‌తో త్రిషకు పుట్టిన రోజు శుభాకాంక్షలు తెలియజేసి అందరిని ఆశ్చర్యపరిచింది.

‘బేబీ నిన్ను ఎప్పుటికీ ప్రేమిస్తుంటాను. నువ్వు నా ప్రతిపాదన ఎప్పుడు అంగీకరిస్తావా అని ఎదురుచూస్తున్నా. పెళ్లి చేసేసుకుందాం! ఇప్పటి ఇది చట్టబద్ధం కూడా’ అంటూ ట్వీట్ చేసింది. గతంలోనూ చార్మి  దాదాపు ఇలాంటి ట్వీట్ చేసింది. అప్పుడు పెళ్లికి నేను సిద్ధమే అంటూ త్రిష రిప్లై కూడా ఇచ్చింది. మరి ఇప్పుడు త్రిష ఏమంటుందో చూడాలి. 

ఇక త్రిష వరస సినిమాలతో హీరోయిన్‌గా కొనసాగుతుండగా, చార్మి మాత్రం నటనకు  గుడ్‌ బై చెప్పేపి సినీ నిర్మాణం మీద దృష్టి పెట్టింది. దర్శకుడు పూరి జగన్నాథ్‌ తో కలిసి పీసీ కనెక్ట్ సంస్థలో సినిమాలు నిర్మిస్తోంది.