ఒకప్పటి హీరోయిన్ ఛార్మి ఇప్పుడు నిర్మాతగా మారి సినిమాలు తీస్తోన్న సంగతి తెలిసిందే. పూరి జగన్నాథ్ తో కలిసి ఈ బ్యూటీ సినిమాలు నిర్మిస్తోంది. తాజాగా 'ఇస్మార్ట్ శంకర్' సినిమాతో సక్సెస్ అందుకొని సంబరాలు జరుపుకొంటుంది.

'ఇస్మార్ట్ శంకర్'పై రోజుకో ట్వీట్ చేస్తూ సినిమాను ప్రమోట్ చేస్తూనే ఉంది. మంగళవారం నాడు ఛార్మి సినిమాకు సంబంధించి ఓ ట్వీట్ చేసింది. మాల్దీవుల్లో 'ఇస్మార్ట్ శంకర్' షూటింగ్ చేస్తున్నప్పుడు ఎదుర్కొన్న ఓ సంఘటన గురించి చెప్పింది. 'ఇస్మార్ట్ శంకర్'లోని 'ఉండిపో' అనే రొమాంటిక్ పాటను మాల్దీవులలో చిత్రీకరించారు. ఈ పాటలోని కొన్ని ఎక్స్ క్లూజివ్ షాట్స్ ను ఓ ఇసుక దీవిలో షూట్ చేశారట. 

ఈ ఇసుక దీవికి ఒక ప్రత్యేకత ఉంది. ప్రతి రోజూ కొన్ని గంటల పాటు మాత్రమే ఈ దీవి కనిపిస్తుందట. ఆ తరువాత మళ్లీ సముద్రం ముందుకొచ్చి ఈ దీవి మునిగిపోతుంది. ఆ కొన్ని గంటల వ్యవధిలోనే పాటకు సంబంధించిన షాట్స్ ని చిత్రీకరించారట. అయితే షూటింగ్ అయిన తరువాత యూనిట్ మొత్తం ఫెర్రీ ఎక్కుతున్న వీడియోను ఛార్మి ట్వీట్ చేశారు. యూనిట్ అందరం సముద్రంలో మునిగిపోతానేమోనని చాలా టెన్షన్ పడినట్లు ట్వీట్ లో పేర్కొంది.

రామ్ హీరోగా నటించిన 'ఇస్మార్ట్ శంకర్' సినిమా ప్రపంచవ్యాప్తంగా రూ.75 కోట్లకు పైగా గ్రాస్ ని వసూలు చేసింది. ఇప్పటికీ సినిమా చాలా థియేటర్ లలో సక్సెస్ ఫుల్ గా దూసుకుపోతుంది.