Asianet News TeluguAsianet News Telugu

తెలుగు బిగ్ బాస్ సీజన్ 2లో ఛార్మి.. తరుణ్, గీతామాధురిల పేర్లు కూడా..

  • ఎన్టీఆర్ హోస్ట్ చేసిన తెలుగు బిగ్ బాస్ సీజన్ 1 సూపర్ హిట్
  • బిగ్ బాస్ సీజన్ 2లో హోస్ట్ గా నాని?
  • ఇప్పటికే ఛార్మి, తరుణ్, లాస్య,గీతామాధురిలు కంటెస్టంట్స్ గా ఓకే అయినట్లు లీకులు

 

charmi kaur in telugu  bigg boss season 2

స్టార్ మా ఛానెల్ ప్రసారం చేసిన బిగ్‌బాస్ రియాల్టీ షో తెలుగు టీవీ చరిత్రలోనే టీఆర్పీల్లో సంచలనం సృష్టించిన సంగతి తెలిసిందే. ఈ షో ఇటీవలే ముగిసింది. ఈ కార్యక్రమానికి హోస్ట్‌ గా వ్యవహరించిన ఎన్టీఆర్... టీవీ ప్రేక్షకులకు ఎన్నో అనుభూతులను పంచిన ఈ కార్యక్రమం రెండో సీజన్‌కు ఏర్పాట్లు చకచకా జరుగుతున్నాయి. తొలి సీజన్‌కు మంచి స్పందన రావటంతో రెండో సీజన్‌ను త్వరలోనే ప్రారంభించాలని నిర్వాహకులు కసరత్తు చేస్తున్నారు.

 

బిగ్‌బాస్2కు కంటెస్టంట్స్ కు సంబంధించి పలువురు సెలబ్రిటీల పేర్లు మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి. తాజా సమాచారం ప్రకారం ఈ కార్యక్రమం వచ్చే ఏప్రిల్‌లో ప్రారంభించాలన్న ప్రయత్నంలో నిర్వాహకులు ముందుకెళ్తున్నారు. ఆరు నెలల ముందే ప్లాన్ సిద్ధం చేయడం ద్వారా పేరున్న సెలబ్రీటీలను గేమ్ షోలోకి తీసుకురావాలన్న ఏర్పాట్లు చేస్తున్నది. దీంతో డేట్ల సమస్య ఉండకుండా తగు జాగ్రత్తలు తీసుకొంటున్నారు. బిగ్‌బాస్2లో పాల్గొనే 14 సెలబ్రిటీల పేర్లు మీడియాలో ప్రముఖంగా వినిపిస్తున్నాయి.

 

గతంలో ప్రముఖ హీరోయిన్‌గా గుర్తింపు పొందిన చార్మీ పేరు బిగ్ బాస్ 2లో ప్రముఖంగా వినిపిస్తోంది. ఇటీవల కాలంలో నిర్మాతగా కూడా మారి జ్యోతిలక్ష్మి చిత్రాన్ని నిర్మించింది. అంతేకాకుండా బాలకృష్ణ హీరోగా నటించిన పైసా వసూల్ చిత్రానికి లైన్ ప్రొడ్యూసర్‌గా వ్యవహరించింది.

 

ఇక తన గాన మాధుర్యంతో ఆకట్టుకొంటున్న గీతామాధురితో కూడా బిగ్‌బాస్ నిర్వాహకులు సంప్రదింపులు జరిపినట్టు సమాచారం. సింగర్‌గానే కాకుండా.. ఆమె అందం కూడా ఈ గేమ్ షోకు అదనపు ఆకర్షణగా మారే అవకాశం ఉంది. అంతేకాకుండా గీతా మాధురి వాక్చాతుర్యం కూడా ప్రేక్షకులను ఆకట్టుకోవడానికి అవకాశం ఉంది.

 

నువ్వే కావాలి చిత్రంతో టాలీవుడ్‌లోకి దూసుకొచ్చి.. ఆ తర్వాత పలు కారణాల వల్ల కనుమరుగైన తరుణ్‌ కూడా బిగ్‌బాస్2 కంటెస్టంట్ జాబితాలో ఉన్నట్టు సమాచారం. ఈ మధ్యకాలంలో సినిమాల్లో తరుణ్ నటించిన దాఖలాలు లేవు. అయితే వివాదాస్పదుడిగా మంచి పేరునే సంపాదించుకొన్నాడు.

యాంకర్‌గా, జడ్జ్‌ గా, దర్శకుడిగా, నిర్మాతగా మంచి ఫామ్‌లో ఉన్న ఓంకార్‌‌ తో కూడా బిగ్‌బాస్ నిర్వాహకులు సంప్రదింపులు జరిపినట్టు తెలుస్తున్నది. దర్శకుడిగా రాజుగారి గదితో సక్సెస్ సాధించిన ఓంకార్ ప్రస్తుతం రాజుగారి గది2 చిత్రం పోస్ట్ ప్రొడక్షన్ పనుల్లో బిజీగా ఉన్నారు.

 

గతంలో హ్యాపీడేస్, కొత్త బంగారం లోకం లాంటి హిట్లతో గుర్తింపు పొందిన యువనటుల్లో వరుణ్ సందేశ్ ఒకరు. ప్రస్తుతం ఫ్లాపులతో సతమతమవుతున్నాడు. ఈ నేపథ్యంలో వరుణ్‌ సందేశ్‌ పేరును కూడా బిగ్‌బాస్ నిర్వాహకులు పరిశీలనలోకి తీసుకొన్నట్టు సమాచారం.

 

టెలివిజన్‌ తెరపై స్టార్ యాంకర్‌గా పేరు తెచ్చుకొన్న లాస్య పేరు కూడా నిర్వాహకులు పరిశీలించారట. ఈ మేరకు ఆమెతో సంప్రదింపులు జరుపుతున్నట్టు సమాచారం.

ఇంకా బిగ్‌బాస్2 జాబితాలో సినీ తారలు శ్రీదేవి, ధన్య బాలకృష్ణ, గజాల, ఆర్యన్ రాజేశ్, తనీష్, కెమెడియన్ వేణు, యూట్యూబ్ స్టార్ వైవా హర్ష తదితరుల పేర్లు ప్రముఖంగా వినిపిస్తున్నాయి. ఎప్పుడు ప్రారంభమవుతుందో అనే విషయాన్ని నిర్వాహకులు త్వరలోనే ప్రకటించనున్నట్టు తెలుస్తున్నది.

 

బిగ్‌బాస్ గేమ్ షోకు సంబంధించి మరో ఆసక్తికరమైన వార్త ప్రచారంలో ఉంది. బిగ్‌బాస్ షోను మరోస్థాయికి తీసుకెళ్లిన ఎన్టీఆర్ రెండో సీజన్‌కు దూరమవుతున్నట్టు తెలుస్తున్నది. ఎన్టీఆర్ స్థానంలో నానిని తీసుకొంటున్నట్టు సమాచారం.

Follow Us:
Download App:
  • android
  • ios