దాదాపు పది నెలలుగా కోవిడ్ వైరస్ దేశాన్ని పట్టిపీడిస్తోంది.  లక్షల మంది కరోనా వైరస్ బారిన పడగా వేల మంది మరణించడం జరిగింది. ఎట్టకేలకు కోవిడ్ వాక్సిన్ అందుబాటులోకి రావడంతో అందరూ ఊపిరిపీల్చుకుంటున్నారు. తెలుగు రాష్ట్రాల్లో కూడా వాక్సినేషన్ ప్రక్రియ కొనసాగుతుంది. ముందుగా ఫ్రంట్ లైన్ వర్కర్స్ కి వాక్సిన్ అందిస్తున్నారు.   

ఈ క్రమంలో అపోలో లైఫ్‌ వైస్‌ చైర్‌పర్సన్‌, బీ పాజిటివ్‌ మ్యాగ్‌జైన్‌ ఎడిటర్‌, మెగాస్టార్‌ కోడలు ఉపాసన కొణిదెల గురువారం కోవిడ్‌ వ్యాక్సిన్‌ తీసుకున్నారు. టీకా‌పై భయాలను తొలగించేందుకు గాను ఆమె అపోలో సిబ్బందితో కలిసి వ్యాక్సిన్‌ తీసుకున్నట్లు తెలిపారు.అంతేకాక జనాలు వ్యాక్సిన్‌పై ఎలాంటి సందేహాలు, భయాలు పెట్టుకోకుండా టీకా తీసుకోవాలని ఉపాసన విజ్ఞప్తి చేశారు. అలాగే అపోలో హాస్పిటల్‌ వ్యవస్థాపకులు, పద్మ విభూషణ్‌ అవార్డుగ్రహీత ప్రతాప్‌ సి. రెడ్డి తొలి రౌండ్‌లో వ్యాక్సిన్‌ తీసుకున్న సంగతి తెలిసిందే.

మెగాస్టార్ కుటుంబాన్ని కూడా కరోనా వదల్లేదు. మొదట చిరంజీవికి కరోనా సోకినట్లు ఆయన సోషల్ మీడియా ద్వారా తెలియజేశారు. ఐతే రోజుల వ్యవధిలోనే తనకు నెగిటివ్ రిజల్ట్స్ వచ్చినట్లు చిరంజీవి తెలియజేశారు. ఆ తరువాత చరణ్ కరోనా బారిన పడ్డారు. హోమ్ క్వారంటైన్ అయిన చరణ్ చికిత్స తీసుకొని కోలుకోవడం జరిగింది. అలాగే మరో మెగా హీరో వరుణ్ కి కూడా కరోనా సోకిన విషయం తెలిసిందే.