రామ్ చ‌ర‌ణ్‌, శ‌ర్వానంద్ చిననాటి స్నేహితులు అనే సంగతి తెలిసిందే. ఇద్దరూ అవకాశమున్నప్పుడల్లా కలుస్తూంటారు, డైలీ ఫోన్ లో టచ్ లో ఉంటూంటారు. అప్పడప్పుడూ ఒకరి సినిమాలు మరొకరు ప్రమోట్ చేస్తూంటారు. అయితే ఇప్పుడా స్నేహం..బంధుత్వంగా మారబోతోందని మీడియాలో వార్తలు వస్తున్నాయి.

అందుతున్న సమాచారం బట్టి...శ‌ర్వానంద్ కి పెళ్లి కుదిరింద‌ని, ఆ పెళ్లి కూతురు..చెర్రీ భార్య ఉపాస‌న ద‌గ్గ‌రి బంధువే, వరసకు చెల్లిలు అవుతుందని అంటున్నారు. త్వ‌ర‌లోనే.. శ‌ర్వానంద్ ఎంగేజ్మెంట్ జ‌ర‌గ‌బోతోంద‌ని కూడా చెప్పుతున్నారు.ఇదెంత‌వ‌ర‌కు నిజ‌మ‌నేదానిపై శ‌ర్వానంద్ అధికారిక ప్ర‌క‌ట‌న చేసేవ‌ర‌కు వేచి చూడాల్సిందే. 

కాగా శ‌ర్వానంద్ ప్ర‌స్తుతం "శ్రీక‌ారం" అనే చిత్రంలో న‌టిస్తున్నారు. ‘గద్దలకొండ గణేష్‌’ వంటి బ్లాక్‌బస్టర్‌ తర్వాత 14 రీల్స్‌ ప్లస్‌ బ్యానర్‌పై రామ్‌ ఆచంట, గోపీ ఆచంట నిర్మిస్తోన్న రెండో చిత్రమిది. సాయికుమార్‌ కీలక పాత్రలో నటిస్తున్నారు.