Asianet News TeluguAsianet News Telugu

‘పుష్ప’ లో ఫహద్‌ ఫాజిల్‌ పోలీస్ కాదా, మరి

పుష్ప సినిమాలో విల‌న్‌గా ఎవ‌రు న‌టిస్తారు? అనే దానిపై చాలా పెద్ద చ‌ర్చే జ‌రిగింది. దీనికి క్లారిటీ ఇస్తూ నిర్మాత‌లు మ‌ల‌యాళ ప్ర‌ముఖ న‌టుడు ప‌హద్ ఫాజిల్ విల‌న్‌గా న‌టిస్తున్నాడంటూ ప్ర‌క‌ట‌న‌ను వెలువ‌రిచారు. దీనికి సంబంధించి చిన్న ప్రోమోను కూడా విడుద‌ల చేసింది నిర్మాణ సంస్థ మైత్రీ మూవీ మేక‌ర్స్‌.

Character Of  Fahad Fazil Pushpa Revealed
Author
Hyderabad, First Published Sep 22, 2021, 1:25 PM IST
  • Facebook
  • Twitter
  • Whatsapp

సినీ లవర్స్ అంతా ఆసక్తిగా ఎదురుచూస్తున్న చిత్రాల్లో ‘పుష్ప’ ఒకటి. ఐకాన్‌ స్టార్‌ అల్లుఅర్జున్‌ హీరోగా ఈ సినిమా తెరకెక్కుతోంది. ఎర్రచందనం స్మగ్లింగ్‌ నేపథ్యంలో తెరకెక్కుతున్న భారీ చిత్రమిది. ప్రముఖ దర్శకుడు సుకుమార్‌ ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు. బన్నీ-సుక్కు కాంబినేషన్‌లో వస్తున్న మూడో సినిమా ఇది. ఇందులో బన్నీ ఎర్రచందనం స్మగ్లర్‌గా పుష్పరాజ్‌ పాత్రలో కనిపించనున్నారు. మరి విలన్ అంటే ఆ  పాత్రను కూడా రివీల్ చేసారు.

మలయాళీ విలక్షణ నటుడు ఫహద్‌ ఫాజిల్‌ ఇందులో విలన్ గా కనిపించనున్నారు. రీసెంట్ గా ఆయన ఈ సినిమా సెట్‌లోకి అడుగుపెట్టారు.  ‘విలన్‌ఆఫ్‌పుష్ప’ పేరుతో ఫహద్‌ ఫస్ట్‌లుక్‌ను షేర్‌ చేస్తే మంచి రెస్పాన్స్ వచ్చింది. ఇందులో ఆయన భన్వర్‌ సింగ్‌ షెకావత్‌ అనే పోలీస్‌ అధికారిగా.. కంటిచూపుతోనే అందర్నీ గజగజ వణికించేలా పవర్‌ఫుల్‌ పాత్రలో కనిపించనున్నారు అని చెప్పారు. అయితే అందుతున్న సమాచారం మేరకు ఫహద్ చేసే పాత్ర ఫారెస్ట్ ఆఫీసర్ అని తెలుస్తోంది. అల్లు అర్జున్ కు, ఫహద్ మధ్య కొన్ని సీన్స్ సినిమాని నెక్ట్స్ లెవిల్ కు తీసుకెళ్లనున్నాయి.

ఈ సినిమాలో ముందుగా మెయిన్ విల‌న్‌గా కోలీవుడ్ న‌టుడు విజ‌య్ సేతుప‌తి పేరు ప్ర‌ముఖంగా వినిపించింది. అయితే మ‌ధ్యలో రెమ్యున‌రేష‌న్‌, డేట్స్ అడ్జ‌స్ట్ కాక‌పోవ‌డం వంటి కారణాల‌తో విజ‌య్ సేతుప‌తి డ్రాప్ అయిన‌ట్లు వార్త‌లు కూడా వినిపించాయి. ఈ మ‌ధ్య మ‌రోసారి విజ‌య్ సేతుప‌తి పేరు మ‌ళ్లీ తెర‌పైకి వ‌చ్చింది. అయితే ఈ వార్త‌ల‌న్నింటికీ చెక్ పెడుతూ పుష్ప టీమ్ .. ఎవ‌రూ ఊహించ‌ని పేరు ప‌హ‌ద్ ఫాజిల్ పేరుని అనౌన్స్ చేయ‌డం విశేషం.

ఎర్రచందనం స్మగ్లింగ్ నేపథ్య కథతో 'పుష్ప'ను రెండు భాగాలుగా తెరకెక్కిస్తున్నారు. ఇందులో బన్నీకి జోడీగా రష్మిక చేస్తోంది. కన్నడ నటుడు ధనుంజయ, అజయ్ తదితరులు కీలకపాత్రలు పోషిస్తున్నారు. దేవిశ్రీ ప్రసాద్ సంగీత దర్శకుడు. సుకుమార్ డైరెక్టర్. మైత్రీమూవీమేకర్స్ భారీ బడ్జెట్​తో నిర్మిస్తోంది. ‘పుష్ప ది రైజ్‌’ పేరుతో మొదటి భాగాన్ని ఈ ఏడాది క్రిస్మస్‌కు ప్రేక్షకుల ముందుకు తీసుకువచ్చేందుకు చిత్రబృందం సన్నాహాలు చేస్తోంది. అంటే  తొలి భాగం ఈ ఏడాది డిసెంబరు 25న థియేటర్లలోకి రానుంది అన్నమాట.

Follow Us:
Download App:
  • android
  • ios