Asianet News TeluguAsianet News Telugu

ఒక్క సినిమాకు రెండు క్లైమాక్స్‌లు

  •  ఒక్క సినిమాకు రెండు క్లైమాక్స్‌లు
  • త‌మిళ్‌లో ఒక స్టైల్‌
  • తెలుగులో మ‌రో స్టైల్‌
  • సినిమా పై భారీ అంచ‌నాలు
CHANGES IN CLIMAX OF SPYDER

 అలా ఎందుకు అంటే తెలుగులో మహేష్ ఫ్యాన్ ఫాలోయింగ్ గురించి తెలిసిందే. అందుకే ఇక్కడ క్లైమాక్స్ ను భారీ ఫైట్ తో హీరోయిజం ఉండేలా చేస్తున్నారట.

ఇక ఇదే స్పైడర్ క్లైమాక్స్ తమిళంలో మాత్రం డిఫరెంట్ గా ఉంటుందట. రియలిస్టిక్ కు ఎక్కువ ప్రాధాన్యత ఇచ్చే తమిళ ఆడియెన్స్ మెచ్చేలా అక్కడ మహేష్ స్పైడర్ క్లైమాక్స్ వేరేలా ఉంటుందట. అంతేకాదు మహేష్ అక్కడ వారికి కొత్త కాబట్టి భారీ హీరోయిజం చూపిస్తే తేడా కొడుతుందేమో అన్న భయంతో ఇలా ప్లాన్ చేశాడట మురుగదాస్.

100 కోట్ల భారీ బడ్జెట్ తో వస్తున్న ఈ సినిమాలో అద్భుతాలు ఎన్నో ఉన్నాయని అంటున్నారు చిత్రయూనిట్. కేవలం క్లైమాక్స్ మాత్రమే కాదు కొన్ని సీన్స్ కూడా తెలుగు తమిళ భాషల్లో వేరు వేరుగా ఉంటాయని అంటున్నారు. మొదటిసారి తమిళ మార్కెట్ మీద కన్నేసిన మహేష్ ఆ క్రమంలో తగిన జాగ్రత్తలే తీసుకుంటున్నాడని చెప్పాలి.

రకుల్ ప్రీత్ సింగ్ హీరోయిన్ గా నటిస్తున్న ఈ సినిమాకు హారీస్ జైరాజ్ మ్యూజిక్ అందిస్తున్నారు. ఠాగూర్ మధు, ఎన్వీ ప్రసాద్ నిర్మాతలుగా భారీ అంచనాలతో సినిమా తెరకెక్కుతుంది.  

Follow Us:
Download App:
  • android
  • ios