పవన్-క్రిష్ మూవీ..ఓ ఇంట్రస్టింగ్ అప్డేట్
ఈ సినిమా స్క్రిప్టుపై ఇంట్రస్టింగ్ అప్డేట్ అందుతోంది. ఇప్పటికే లాక్ చేసిన ఈ స్క్రిప్టు ని మరోసారి రీరైట్ చేస్తున్నారట. పవన్ కళ్యాణ్ రీసెంట్ గా ఈ స్క్రిప్టు మరోసారి చదివి తనదైన కొన్ని సూచనలు అందచేసారట.
పవర్‌స్టార్ పవన్ కల్యాణ్, డైరెక్టర్ క్రిష్ కాంబినేషన్ లో ఓ సినిమా తెరకెక్కుతోన్న విషయం తెలిసిందే. ఆ మధ్యన ఈ ప్రాజెక్టుకు సంబంధించిన ప్రీ లుక్ పోస్టర్ విడుదల చేయగా, అభిమానులను విపరీతంగా ఆకట్టుకుంది. ఇప్పుడు ఈ సినిమా స్క్రిప్టుపై ఇంట్రస్టింగ్ అప్డేట్ అందుతోంది. ఇప్పటికే లాక్ చేసిన ఈ స్క్రిప్టు ని మరోసారి రీరైట్ చేస్తున్నారట. పవన్ కళ్యాణ్ రీసెంట్ గా ఈ స్క్రిప్టు మరోసారి చదివి తనదైన కొన్ని సూచనలు అందచేసారట.
దానికి తోడు పవన్ వరస ప్రాజెక్టులతో బిజిగా ఉండటంతో క్రిష్ కు టైమ్ దొరికినట్లైంది. ఈ టైమ్ ని వృధా చేసుకోదలుచుకోలేదు. కథకు ఉన్న లూజ్ ఎండ్స్ పై వర్క్ చేస్తున్నారట. తన రైటర్స్ టీమ్ తో కలిసి రాత్రింబవళ్లు ఈ స్క్రిప్టు వర్క్ చేస్తున్నట్లు ఫిల్మ్ నగర్ వర్గాల సమాచారం. ఎన్టీఆర్ బయోపిక్ తర్వాత రానున్న ఈ సినిమాతో ఎలాగైనా ఫామ్ లోకి రావాలని క్రిష్ భావిస్తున్నారు. పవన్ వంటి స్టార్ తో హిట్ కొడితే మళ్లీ స్టార్ హీరోలతో వరస ప్రాజెక్ట్ లు చేయచ్చు.
మరో ప్రక్క ఈ చిత్రం టైటిల్ పట్ల కూడా ఫ్యాన్స్ లో ఎంతో ఆసక్తి, కుతూహలం నెలకొన్నాయి. ఈ చిత్రానికి ‘ఓం శివమ్’ అనే టైటిల్‌ను ఫైనల్ చేసినట్లు సమాచారం. అయితే, దీనిపై అధికారిక సమాచారం ఏమీ లేదు. అలాగే ఈ సినిమాలో బాలీవుడ్ హీరోయిన్ జాక్వెలిన్ ఫెర్నాండేజ్ పీకే సరసన నటించనున్నట్లు ఇండస్ట్రీ వర్గాల ద్వారా తెలుస్తోంది. పవన్ ఈ చిత్రంలో రాబిన్ హుడ్ తరహా పాత్రలో కనిపిస్తాడని సమాచారం. ఈ మూవీ మెగా సూర్య ప్రొడక్షన్ బ్యానర్‌పై ఏఎం రత్నం భారీ బడ్జెట్ తో నిర్మిస్తున్నారు. మొఘలుల కాలం నాటి పీరియాడిక్ యాక్షన్ డ్రామా కావడంతో పాన్ ఇండియా మూవీగా విడుదల చేయనున్నారని తెలుస్తోంది.
ఈ సినిమా కోసం హాలీవుడ్ నిపుణులు రంగంలోకి దిగబోతున్నట్లు తెలుస్తోంది. చారిత్రక నేపథ్యం ఉన్న కథ కావడంతో వీఎఫ్‌ఎక్స్ సన్నివేశాలకు ఎక్కువ ఇంపార్టెన్స్ ఇస్తున్నారట మేకర్స్. ‘ఆక్వామెన్’, ‘స్టార్ వార్స్ ఎపిసోడ్ VII-ది ఫోర్స్ అవేకన్స్’, ‘వార్‌క్రాఫ్ట్’ వంటి సినిమాలకు పనిచేసిన వీఎఫ్‌ఎక్స్ నిపుణుడు బెన్ లాక్ ఈ సినిమాకి పనిచేస్తున్నారని టాక్.