యువ దర్శకుడు చందు ముండేటి తెరకెక్కించిన కార్తికేయ 2 ఆగష్టు 12న రిలీజ్ కి రెడీ అవుతోంది. హీరో నిఖిల్ తో కలసి చందు ముండేటి ప్రచార కార్యక్రమాలలో పాల్గొంటున్నారు.

యువ దర్శకుడు చందు ముండేటి తెరకెక్కించిన కార్తికేయ 2 ఆగష్టు 12న రిలీజ్ కి రెడీ అవుతోంది. హీరో నిఖిల్ తో కలసి చందు ముండేటి ప్రచార కార్యక్రమాలలో పాల్గొంటున్నారు. హీరోయిన్ అనుపమ పరమేశ్వరన్ ప్రమోషన్స్ కి అందుబాటులో ఉండడం లేదు. వేరే ప్రాజెక్ట్స్ తో బిజీగా ఉండడం వల్ల కుదరడం లేదని అనుపమ తెలిపింది. 

చందు ముండేటి, హీరో నిఖిల్ తాజాగా అలీ హోస్ట్ గా నిర్వహిస్తున్న అలీతో సరదాగా అనే టాక్ షోలో పాల్గొన్నారు. అలీ వీరిద్దరిని అనేక సరదా ప్రశ్నలు అడిగారు. వివాహం తర్వాత లైఫ్ ఎలా ఉంది అని నిఖిల్ ని ప్రశ్నించాడు. మొదటి భాగంలో హీరోయిన్ అయిన స్వాతిని ఎందుకు తీసుకోలేదు అని అలీ ప్రశ్నించాడు. 

దీనికి చందు ముండేటి మాట్లాడుతూ.. మీకు తెలుసు కదా సర్.. ఏదైనా హీరో డెసిషన్స్ పైనే ఆధారపడి ఉంటుంది.. అంతా నిఖిల్ వల్లే అన్నట్లుగా పరోక్షంగా కామెంట్స్ చేశాడు. వెంటనే నిఖిల్.. అయ్యో నాకేం సంబంధం లేదు అని తెలిపాడు. ఇలా సరదాగా వారి మధ్య సంభాషణ జరిగింది. 

ఇక చందు ముండేటి తనకు నాగార్జున అంటే ఇష్టం అని, ఆయన్ని ఎప్పుడు కలిసినా పోలీస్ కథ గురించి చర్చిస్తుంటాను అని అన్నారు. కార్తికేయ 2 అనుకున్న విధంగా విజయం సాధిస్తే ఆయనతో 'విక్రమ్' లాంటి సినిమా ప్లాన్ చేస్తాను అని అన్నారు. 

ఈ చిత్ర కథ ఎక్కువగా శ్రీకృష్ణుడు, ద్వారకా నగరం చుట్టూ తిరుగుతుంది అని.. ఆధ్యాతిక అంశాలు ఉంటూనే థ్రిల్లింగ్ ఎలిమెంట్స్ ఉంటాయని నిఖిల్ ఓ ఇంటర్వ్యూలో తెలిపారు.