Asianet News TeluguAsianet News Telugu

వైఎస్, చంద్రబాబులపై దేవకట్టా వెబ్ సిరీస్, ఆర్టిస్ట్ లు ఎవరంటే

 ప్రపంచంలో జరిగే పోటీలన్నిటికీ పర్పస్ ఒక్కటే.. విన్నర్స్ ని ఎంచుకోవడం. విన్నర్స్ రన్ ది వరల్డ్.. ఆ పోటీలో అనుకోకుండా ఇద్దరు స్నేహితులు ఎదురైతే.. 

Chandrababu  YSR Story As A Web Series by devakatta jsp
Author
First Published Sep 6, 2023, 10:32 AM IST


''నైతికత మారుతుంది.. కానీ అధికారం కోసం జరిగే యుద్ధం స్థిరంగా ఉంటుంది'' అంటూ మూడేళ్ల క్రితం దివంగత సీఎం వైఎస్‌ రాజశేఖర్‌రెడ్డి - టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడుల నిజ జీవిత పాత్రల ఆధారంగా ఓ పొలిటికల్ థ్రిల్లర్ వెబ్ సీరిస్ చేయాలని దేవకట్టా ప్లాన్ చేసారు. ఇద్దరు   నాయకుల మధ్య స్నేహం, రాజకీయ వైరం నేపథ్యంలో ఈ సినిమా ఉంటుందని చెప్పారు. అంతేకాకుండా 'ఇంద్రప్రస్థం' అనే టైటిల్‌ తో మోషన్ పోస్టర్‌ కూడా విడుదల చేశారు. అయితే రకరకాల కారణాలతో ఆ ప్రాజెక్టు పట్టాలు ఎక్కలేదు. మళ్లీ ఇంతకాలానికి ఆ ప్రాజెక్టు వెలుగులోకి వచ్చింది.  ఈ స్క్రిప్ట్ ఐడియాను సోనీ లివ్ ఓటీటీ సంస్థ ఓకే చేసినట్లు సమాచారం. త్వరలోనే ఈ ప్రాజెక్ట్ ను సెట్స్ మీదకు తీసుకెళ్లాలని చూస్తున్నారు.  సీరిస్ లో వచ్చే రెండు ప్రధాన పాత్రలకు సరైన నటుల ఎంపిక కూడా పూర్తైందని సమాచారం. 

  చంద్రబాబు నాయుడి పాత్ర కోసం రానా దగ్గుబాటిని సంప్రదిస్తే ఓకే చెప్పారట. ఆయన  ఆల్రెడీ ఎన్టీఆర్ బయోపిక్ లో అదే పాత్రలో కనిపించారు.ఇక ఆయనకు సమ ఉజ్జీ  గా వైఎస్ పాత్ర కు  ఆది పినిశెట్టిని తీసుకోవాలని దేవా కట్టా భావిస్తున్నట్లు  తెలుస్తోంది. అలానే మరో కీలకమైన పాత్రకు త్యదేవ్ ను సంప్రదిస్తే నో చెప్పారని టాక్ నడుస్తోంది. మిగతా పాత్రల్లో కూడా బాగా పేరున్న, తెలుసున్న నటులతోనే ముందుకు వెళ్లనున్నారు. ఇక హాలీవుడ్ 'గాడ్‌ ఫాదర్‌' సినిమా స్ఫూర్తితో ఈ వెబ్ సీరిస్ స్క్రిప్ట్‌ రెడీ చేసుకున్నారు దేవాకట్టా. 
 
ఇక గతంలో ఈ వెబ్ సిరీస్ విషయంలో అప్పట్లో దర్శకుడు దేవా కట్టా, నిర్మాత విష్ణు ఇందూరి మధ్య వివాదం మొదలైంది. ఇదే పాయింట్ ని తీసుకొని రాజ్ దర్శకత్వంలో విష్ణు ఇందూరి నిర్మాణంలో ఓ వెబ్ సిరీస్ రూపొందనుందని అప్పట్లో వార్తలు వచ్చాయి. దీనిపై దేవా కట్టా స్పందిస్తూ.. తన ఐడియాస్ ని హైజాక్ చేసి ఎన్టీఆర్ బయోపిక్ రూపొందించారని, ఒకసారి మోసపోయాను కానీ మరోసారి మోసపోవడానికి సిద్ధంగా లేను అంటూ  కామెంట్స్ చేసారు.  తన ఎఫర్ట్స్ ని, తన ఫిక్షనల్ ఆలోచనలను కాపీ చేసినా తీవ్ర పరిణామాలు ఎదుర్కోవాల్సి వస్తుందని హెచ్చరించారు. 

 ''ప్రపంచంలో జరిగే పోటీలన్నిటికీ పర్పస్ ఒక్కటే.. విన్నర్స్ ని ఎంచుకోవడం. విన్నర్స్ రన్ ది వరల్డ్.. ఆ పోటీలో అనుకోకుండా ఇద్దరు స్నేహితులు ఎదురైతే.. ఆ ఆటకున్న కిక్కే వేరు'' అంటూ దేవా కట్ట వాయిస్ ఓవర్ తో అప్పట్లో మోషన్ పోస్టర్ వదిలారు.త్వరలో ఆంధ్రప్రదేశ్ ఎన్నికలు ఉన్నాయి కాబట్టిఈ వెబ్ సీరిస్ కు మరింత క్రేజ్ వచ్చే అవకాసం ఉంది.

Follow Us:
Download App:
  • android
  • ios