'మహానటి'కి సీఎం ప్రశంస!

chandrababu praises mahanati movie
Highlights

మహానటి సినిమా అద్భుతమని ప్రతి ఒక్కరూ కూడా ఈ సినిమాను ఆకాశానికెత్తేస్తున్నారు

మహానటి సినిమా అద్భుతమని ప్రతి ఒక్కరూ కూడా ఈ సినిమాను ఆకాశానికెత్తేస్తున్నారు. అంతగా ప్రేక్షకులపై ఇంపాక్ట్ చూపించిందీ సినిమా. టాలీవుడ్ కు చెందిన ప్రముఖులతో పాటు కొందరు రాజకీయనాయకులు సైతం ఈ సినిమాపై ప్రశంసల జల్లు కురిపించారు. తాజాగా ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఈ సినిమా గురించి ప్రస్తావించారు. శుక్రవారం టీడీఎల్పీ భేటీలో పాల్గొన్న ఆయన సావిత్రి బయోపిక్ పై స్పందించారు.  

సావిత్రి బయోపిక్ బాగుందని ఎయిర్ పోర్ట్ లో కొంతమంది చెప్పారని అన్నారు. అలానే నాయకులను ఈ సినిమా ఎలా ఉందో అడిగి తెలుసుకున్నానన్నారు. సినిమాలో మంచి సందేశం కూడా ఉందని తప్పకుండా ఈ సినిమా చూస్తానని అన్నారాయన. జీవిత చరిత్రలతో సినిమాలు తీస్తే.. ప్రజలు ఎప్పుడూ ఆదరిస్తూనే ఉంటారని వెల్లడించారు. 

loader