సావిత్రిని మద్యానికి బానిస చేసింది చంద్రబాబే..!

chandrababu is the reason behind savithri to become alchoholic
Highlights

సావిత్రిని మద్యానికి బానిస చేసింది చంద్రబాబే..!

'మహానటి' సావిత్రి సినిమా పాజిటివ్ టాక్ తో బాక్సాఫీస్ వద్ద దూసుకుపోతుంది. ప్రతి ఒక్కరూ ఈ సినిమాపై ప్రశంసలు గుప్పిస్తునే ఉన్నారు. తెలుగుతో పాటు తమిళంలో కూడా ఈ సినిమాను విడుదల చేశారు. అయితే ఆమె కెరియర్ ముగింపు దశలో మద్యానికి బానిసగా మారి అనారోగ్య పాలయ్యారు. సినిమాలో దీనికి కారణం జెమిని గణేషన్ అని చూపించినా చరిత్రలో మాత్రం సావిత్రికి మందుని అలవాటుగా మార్చింది మాత్రం జెపి చంద్రబాబు అని తెలుస్తుంది.

నటుడు, నిర్మాత అయిన జెపి చంద్రబాబు యాక్టర్, డ్యాన్సర్, డైరక్టర్ అన్ని రంగాల్లో ప్రతిభ కలిగిన వ్యక్తట. కెరియర్ పీక్స్ లో ఉన్నప్పుడే అప్పటి ప్రముఖ నిర్మాత కూతురు షీలాని పెళ్లాడాడట చంద్రబాబు. చంద్రబాబుతో పెళ్లికి ముందే షీలా మరోవ్యక్తితో సంబంధం పెట్టుకుందట. దానితో వైవాహిక జీవిత దెబ్బతిన్నదట. కెరియర్ పరంగా కూడా ఎం.జి.ఆర్ ను పెట్టి తీసిన మాది విట్టు ఇజై సినిమా కూడా విడుదలకు నోర్చుకోలేదట.. దానితో నష్టాలపాలైన చంద్రబాబు మద్యానికి బానిస అయ్యాడట.

షూటింగ్ టైం లో ఎం.జి.ఆర్ తమ్ముడితో చంద్రబాబు గొడవ పెట్టుకోవడం వల్లే ఎం.జి.ఆర్ ఆ సినిమాకు సహకరించలేదని తెలుస్తుంది. తాగుడుకి బాగా అలవాటైన చంద్రబాబుకి సావిత్రి పరిచయం అయ్యిందట. ఇక తనకున్న ఈ తాగుడు అలవాటిని సావిత్రికి అంటించాడట చంద్రబాబు. చంద్రబాబుకి కెరియర్ లో ఎదురైన ఆర్ధిక ఇబ్బందులు సావిత్రికి ఎదురవడంతో ఆమె కూడా మందుకి బానిసగా మారిందట.

చంద్రబాబు వల్లే ఆమె మద్యానికి బాగా అలవాటు పడిందని తెలుస్తుంది. బాగా తాగడం వల్ల డయాబెటిస్, హైబీపీ లాంటివి వచ్చాయని దాదాపు 18 నెలలు పాటు కోమాలో ఉన్న సావిత్రి డిసెంబర్ 26 1981లో తుది శ్వాస విడిచారు.

loader