యంగ్ హీరో నిఖిల్ నుంచి అంతా ఆసక్తిగా ఎదురుచూస్తున్న చిత్రం త్వరలో ప్రారంభం కాబోతోంది. శనివారం రోజు నిఖిల్ బర్త్ డే సంధర్భంగా కార్తికేయ 2 చిత్రాన్ని అధికారికంగా ప్రకటించారు. చాలా రోజులుగా కార్తికేయ 2 గురించి మీడియాలో వార్తలు వస్తున్నాయి. 2014లో విడుదలైన కార్తికేయ చిత్రం నిఖిల్ కెరీర్ లో బిగ్గెస్ట్ హిట్ గా నిలిచింది. ఉత్కంఠ భరితంగా సాగే కథ, కథనాలతో దర్శకుడు చందు ముండేటి మ్యాజిక్ చేశాడు. 

త్వరలో కార్తికేయ 2 ప్రారంభించబోతున్నట్లు చందు ముండేటి అధికారికంగా ప్రకటించారు. విశ్వప్రసాద్, వివేక్ కూచిబొట్ల ఈ చిత్రానికి నిర్మాతలుగా వ్యవహరించనున్నారు. నిఖిల్ బర్త్ డే సందర్భంగా ఈ ప్రకటన చేస్తున్నాం. దర్శకుడిగా కార్తికేయ నాకు తొలి చిత్రం. ఆ చిత్రం బిగ్గెస్ట్ హిట్ గా నిలిచింది. ఇప్పుడు కార్తికేయ 2పై ఎలాంటి అంచనాలు ఉంటాయో నాకు తెలుసు. 

కార్తికేయ 2 చిత్రం తెరకెక్కించాలని అభిమానులు కూడా కోరుకుంటున్నారు. కార్తికేయ కంటే కార్తికేయ 2 భారీ స్థాయిలో ఉండబోతోంది. త్వరలో ఇతర నటీనటుల వివరాలు ప్రకటిస్తాం అని చందు ముండేటి తెలిపారు. కార్తికేయ చిత్రంలో నిఖిల్ కు హీరోయిన్ గా కలర్స్ స్వాతి నటించింది. వారిద్దరి మధ్య కెమిస్ట్రీ అద్భుతంగా పండింది. కార్తికేయ 2లో ఎవరిని ఎంచుకుంటారో వేచి చూడాలి.