వరుస పరాజయాలతో ఢీలా పడ్డ యాక్షన్ అండ్ ఫ్యామిలీ హీరో గోపీచంద్ తమిళ కొత్త దర్శకుడుతో హిట్ కొట్టేందుకు రెడీ అయ్యారు. కోలీవుడ్ ఫేమ్ తిరుని తెలుగుకు దర్శకుడిగా 
పరిచయం చేస్తూ ఏకే ఎంటర్ టైన్మెంట్స్ బ్యానర్‌పై 'చాణక్య' అనే స్పై థ్రిల్లర్‌తో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు గోపీచంద్.

ఈరోజు వినాయకచవితి సందర్భంగా సినిమాకి సంబంధించిన పోస్టర్ ని రిలీజ్ చేశారు. ఇందులో గోపీచంద్ గన్ పట్టుకొని కాలుస్తుండగా.. పైన విమానాలు సెటప్ మొత్తం భారీగానే కనిపిస్తోంది. కనీసం ఈ సినిమాతోనైనా గోపీచంద్ హిట్ అందుకుంటాడేమో చూడాలి. 

ప్రస్తుతం సినిమాకి సంబంధించిన పాటల చిత్రీకరణ ఇటలీలో మిలాన్ లో జరుగుతోంది. ఈ సినిమాలో గోపీచంద్ సరసన హీరోయిన్ గా మెహ్రీన్ కనిపించనుంది. బాలీవుడ్ బ్యూటీ జరీన్ ఖాన్ మరో ముఖ్య పాత్రలో కనిపించనుంది.

టెక్నికల్ పరంగా ఈ చిత్రానికి విశాల్ చంద్రశేఖర్ సంగీతం అందిస్తుండగా.. వెట్రి పళనిస్వామి సినిమాటోగ్రఫీ సందిస్తున్నారు. అబ్బూరి రవి ఈ చిత్రానికి సంభాషణలు అందిస్తున్నారు. దసరా కానుకగా సినిమాను ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నారు.