`చక్రవ్యూహం` మూవీ రివ్యూ.. అజయ్‌ సక్సెస్‌ అయ్యాడా?

అజయ్‌ మరోసారి మెయిన్‌ లీడ్‌గా ప్రయోగం చేశాడు. `చక్రవ్యూహంః ది ట్రాప్‌` చిత్రంలో నటించారు. వివేక్‌ త్రివేది, సిరి జంటగా నటించారు. చెట్కూరి మధుసూధన్‌ దర్శక్వం వహించిన ఈ చిత్రం నేడు శుక్రవారం(జూన్‌ 2)న విడుదలైంది. మరి ఈ `చక్రవ్యూహం` ఆడియెన్స్ ని మెప్పించిందా? అనేది రివ్యూలో తెలుసుకుందాం. 

chakravyuham movie review ajay did memerizing you ? arj

అజయ్‌ విలన్‌గా తెలుగు ఆడియెన్స్ కి బాగా సుపరిచితం. ఆయన హీరోలకు ఫ్రెండ్‌గా చేసి మెప్పించాడు. హీరోగానూ తన అదృష్టాన్ని పరీక్షించుకున్నాడు. తాజాగా ఆయన మరోసారి మెయిన్‌ లీడ్‌గా ప్రయోగం చేశాడు. `చక్రవ్యూహంః ది ట్రాప్‌` చిత్రంలో నటించారు. వివేక్‌ త్రివేది, సిరి జంటగా నటించారు. చెట్కూరి మధుసూధన్‌ దర్శక్వం వహించిన ఈ చిత్రం నేడు శుక్రవారం(జూన్‌ 2)న విడుదలైంది. మరి ఈ `చక్రవ్యూహం` ఆడియెన్స్ ని మెప్పించిందా? అనేది రివ్యూలో తెలుసుకుందాం. 

కథః

సంజయ్‌(వివేక్‌ త్రివేది), శరత్‌(సుదేష్‌) మంచి స్నేహితులు. అనాథ అయిన సంజయ్‌.. శరత్‌ ఫ్యామిలీ ఫ్రెండ్‌ అయిన సిరి(ఊర్వశి పరదేశి)ని చూసి ఇష్టపడతాడు. స్నేహం నుంచి ప్రేమగా మారి, పెళ్లి చేసుకుంటారు. ఆ తర్వాత సంజయ్‌, శరత్‌ కలిసి బిజినెస్‌ కూడా స్టార్ట్ చేస్తారు. అంతా బాగుందనుకునే సమయంలో ఊహించని షాక్‌. సంజయ్‌ లేని సమయంలో సిరి హత్యకు గురవుతుంది. ఆ మర్డర్‌ మిస్టరీని సీఐ సత్య(అజయ్‌) ఇన్వెస్టిగేషన్‌ చేస్తుంటాడు. ఈ కేసు నడుస్తున్న క్రమంలోనే సంజయ్‌ ఫ్రెండ్‌ శరత్‌ సైతం హత్యకు గురవుతాడు. మరి ఈ వరుస హత్యలకు కారణం ఏంటి? ఈ హత్యల వెనుకున్నది ఎవరు? సిరి ఫ్యామిలీ బ్యాక్‌గ్రౌండ్‌ ఏంటి? ఈ కేసులను సీఐ సత్య ఎలా సాల్వ్ చేశాడు, ఈ క్రమంలో వచ్చే ట్విస్ట్ లు, టర్న్ లేంటనేది మిగిలిన సినిమా. 

విశ్లేషణః
మర్డర్‌ మిస్టరీ, సస్పెన్స్ థ్రిల్లర్‌ చిత్రాల కథలు అటు ఇటుగా సేమ్‌ అనే చెప్పాలి. కానీ దాన్ని తెరకెక్కించిన తీరు, ఎంత ఉత్కంఠభరితంగా, ఎన్ని ట్విస్ట్ లు, టర్న్ లతో ఊహించని విధంగా స్క్రీన్‌ప్లేని నడిపిస్తేనే సినిమా సక్సెస్‌ అవుతుంది. ఆడియెన్స్ ని అనుక్షణం ఎంగేజ్‌ చేస్తూ థ్రిల్ల్‌ చేయాల్సి ఉంటుంది. అదే పెద్ద సవాల్‌. అక్కడ సక్సెస్‌ అయితే సినిమా సక్సెస్‌ అయినట్టే. `చక్రవ్యూహం` సినిమా విషయంలో మేకర్స్ ఆ కేర్‌ తీసుకున్నారు. అయితే ఏ దర్శకుడైన సక్సెస్‌ కొట్టేందుకు ఇది సేఫ్‌ జోనర్‌ కూడా. ఈ చిత్ర దర్శకుడు ఒక విషయంలో సాహసం చేస్తూ, మరో విషయంలో సేఫ్‌ గేమ్‌ ఆడాడనిపిస్తుంది. సినిమాని సాధ్యమైనంత వరకు ఎంగేజింగ్‌గా తీసుకెళ్లే ప్రయత్నం చేశాడు. మర్డర్‌ వెనకాల మిస్టరీని చివరి వరకు క్యారీ అయ్యేలా జాగ్రత్తలు తీసుకున్నారు. ఆ విషయంలో అభినందించాల్సిందే. 

అయితే ఈ సినిమా ప్రారంభంలో సినిమాపై ఆసక్తిని రేకెత్తించేలా సీన్లు ప్లాన్‌ చేశారు. కథనం సరికొత్తగా ప్రారంభమవుతుంది. నెక్ట్స్ ఏం జరుగుతుందనే క్యూరియాసిటీని ప్రారంభం నుంచే ఆడియెన్స్ లో కలిగించేలా చేశాడు. కానీ ఆ తర్వాత రెగ్యూలర్‌ జోన్‌లోకి వెళ్లిన ఫీలింగ్‌ కలిగిస్తుంది. ఇన్వెస్టిగేషన్‌కి సంబంధించిన ఎపిసోడ్‌కి ఎక్కువ టైమ్‌ తీసుకున్నారు. దీంతో అక్కడే కథ తిరుగుతున్న ఫీలింగ్‌ కలుగుతుంది. సెకండాఫ్‌లో కథనం ఊపందుకుంటుంది. ఊహకందని ట్విస్టులు ఎంగేజ్‌ చేసేలా ఉంటాయి. అప్పటి వరకు మామూలుగా సాగే పాత్రలు ఒక్కసారిగా మలుపు తీసుకుంటాయి. ప్రతి పాత్రలోని మరో కోణం బయటపడుతుంటే ఆడియెన్స్ వాహ్‌ అనే ఫీలింగ్‌ కలుగుతుంది. సెకండాఫ్‌లో వచ్చే ట్విస్ట్ లు ఆడియెన్స్ చేత ఈలలు వేయించేలా ఉంటాయి. ఇక సినిమా అయిపోయిందనుకునే సమయంలో మరో ట్విస్ట్ తో కథ నెక్ట్స్ లెవల్‌కి చేరుతుంది. క్లైమాక్స్ అదిరిపోయేలా ఉంటుంది. అయితే ఇన్వెస్టిగేషన్‌కి సంబంధించిన సీన్లు ఫాస్ట్ గా సాగేలా కేర్‌ తీసుకుని, మరింత క్రిస్పీగా సీన్లు డిజైన్‌, మలుపులు కొత్తగా రాసుకుని ఉంటే సినిమా స్థాయి ఇంకా బాగుండేది. 

నటీనటులుః టెక్నీషియన్లుః

అజయ్‌ ఎలాంటి పాత్ర అయినా రక్తికట్టిస్టాడు. సీరియస్‌ పాత్రలకు ప్రాణం పోస్తాడు. ఇందులో పోలీస్‌గా అదరగొట్టాడు. తనదైన బాడీ లాంగ్వేజ్‌, యాక్టింగ్‌ ఆకట్టుకుంటుంది. చాలా వరకు సినిమాని తన భుజాలపై మోశారని చెప్పొచ్చు. శిల్ప పాత్రలో ప్రగ్యా నయన్‌ ఆకట్టుకునేలా చేసింది. గ్లామర్‌ పాత్రలో అదరగొట్టింది. నెగటివ్‌ షేడ్స్ లోనూ కట్టిపడేసింది. సినిమాకి మరో పిల్లర్‌లా నిలిచింది. అలాగే వివేక్‌ త్రివేది, ఊర్వశి నటన ఆకట్టుకుంటుంది. జ్ఞానేశ్వరి కండ్రేగుల యాక్టింగ్ స్కోప్ ఉన్న రోల్ ట్రై చేశారు. వీరితోపాటు రాజీవ్‌ కనకాల, శ్రీకాంత్‌ అయ్యంగార్‌, శుభలేఖ సుధాకర్‌, ఊర్వశి, ప్రియాలు ఫర్వాలేదనిపించారు. 
టెక్నీకల్‌గా దర్శకుడు చెట్కూరి మధుసూధన్‌ ఈ సినిమాని తన బెస్ట్ గా తీసే ప్రయత్నం చేశాడు. ఉత్కంఠభరితంగా కథనం సాగేలా కేర్‌ తీసుకున్నాడు. ఎక్కడ ట్విస్టు లు, టర్న్‌లో పెట్టాలో పర్‌ఫెక్ట్ గా మెయింటేన్‌ చేశాడు. కాకపోతే ల్యాంగ్‌ తగ్గించాల్సి ఉంది. రేసీగా స్క్రీన్‌ ప్లే సాగేలా ప్రయత్నం చేయాల్సింది. జీవీ అజయ్‌ కెమెరా వర్క్ బాగుంది. భరత్‌ మంచిరాజు మ్యూజిక్‌, బీజీఎం ఉన్నంతలో బెస్ట్ అని చెప్పాలి. నిర్మాణం పరంగానూ నిర్మాత సావిత్రి క్వాలిటీగా తీశారు. 

ఫైనల్‌గాః అంచనాలు లేకుండా చూస్తే `చక్రవ్యూహం` మంచి థ్రిల్‌ చేసే చిత్రమవుతుంది. 

రేటింగ్‌ః 2.75


నటీనటులు : అజయ్, జ్ఞానేశ్వరి కండ్రేగుల, వివేక్ త్రివేది, ఊర్వశి పరదేశి, ప్రగ్యా నయన్, శుభలేఖ సుధాకర్, రాజీవ్ కనకాల, ప్రియ, శ్రీకాంత్ అయ్యంగార్, కిరీటి, రాజ్ తిరందాసు తదితరులు  
ఛాయాగ్రహణం : జీవీ అజయ్
సంగీతం : భరత్ మంచిరాజు 
సహ నిర్మాతలు : వెంకటేష్, అనూష
నిర్మాత :   సావిత్రి
రచన, దర్శకత్వం : చెట్కూరి మధుసూధన్
 

Latest Videos
Follow Us:
Download App:
  • android
  • ios