Asianet News TeluguAsianet News Telugu

ఈ వారం 3 సినిమాలు..ప్రీ రిలీజ్ బిజినెస్ దేనికెంత?

  గత వారం తెలుగులో నాలుగు సినిమాలు.. జాతిరత్నాలు, శ్రీకారం, గాలి సంపత్‌, లవ్‌ లైఫ్‌ అండ్‌ పకోడి సినిమాలు విడుదలయ్యాయి. వాటిలో జాతిరత్నాలు పాజిటివ్‌ టాక్‌తో కలెక్షన్స్ పరంగా ఓ రేంజిలో దూసుకెళ్తోంది. ఇక ఈ రోజు శుక్రవారం (మార్చి 19)కూడా ఐదు చిత్రాలు విడుదల కాబోతుంది. ఆ సినిమాలు మంచు విష్ణు ’మోసగాళ్ళు’, కార్తికేయ ‘చావు కబురు చల్లగా’, ఆది సాయికుమార్‌ ‘శశి’ తో పాటు ‘ఇదే మా కథ’, ‘ఈ కథలో పాత్రలు కల్పితం’. ఆ సినిమాల  ప్రీ రిలీజ్ బిజినెస్ ఏ స్దాయిలో జరిగిందో చూద్దాం.
 

Chaavu Kaburu Challaga, Sashi, Mosagallu Pre-Release Business jsp
Author
Hyderabad, First Published Mar 19, 2021, 9:16 AM IST

  గత వారం తెలుగులో నాలుగు సినిమాలు.. జాతిరత్నాలు, శ్రీకారం, గాలి సంపత్‌, లవ్‌ లైఫ్‌ అండ్‌ పకోడి సినిమాలు విడుదలయ్యాయి. వాటిలో జాతిరత్నాలు పాజిటివ్‌ టాక్‌తో కలెక్షన్స్ పరంగా ఓ రేంజిలో దూసుకెళ్తోంది. ఇక ఈ రోజు శుక్రవారం (మార్చి 19)కూడా ఐదు చిత్రాలు విడుదల కాబోతుంది. ఆ సినిమాలు మంచు విష్ణు ’మోసగాళ్ళు’, కార్తికేయ ‘చావు కబురు చల్లగా’, ఆది సాయికుమార్‌ ‘శశి’ తో పాటు ‘ఇదే మా కథ’, ‘ఈ కథలో పాత్రలు కల్పితం’. ఆ సినిమాల  ప్రీ రిలీజ్ బిజినెస్ ఏ స్దాయిలో జరిగిందో చూస్తాం. 

మొదటగా ..క్రేజ్ ఉన్న సినిమా ...యంగ్‌ హీరో కార్తికేయ, హీరోయిన్‌ లావణ్య త్రిపాఠి జంటగా నటించిన చిత్రం 'చావు కబురు చల్లగా’. గీతాఆర్ట్స్ నిర్మాణంలో రూపొందిన ఈ సినిమాపై భారీ అంచనాలు నెలకొన్నాయి. ఈ సినిమాలో లావణ్య త్రిపాఠి భర్త కోల్పోయిన వితంతువుగా కనిపిస్తోంది. హీరో కార్తికేయ అంబులెన్స్ డ్రైవర్ గా పని చేస్తుంటారు. 

వీరిద్దరి మధ్య చోటుచేసుకునే ఒక విచిత్రమైన ప్రేమకథా నేపథ్యంలో చావు కబురు చల్లగా సినిమా తెరకెక్కింది. ఈ సినిమాకు థియోటర్ రైట్స్ రెండు రాష్ట్రాల్లోనూ కలిపి 12 కోట్లకు అమ్ముడుపోయాయి. కార్తీకేయ హిట్ చిత్రం ఆర్ ఎక్స్ 100 అప్పట్లో 11.60 కోట్లు ఫుల్ రన్ లో కలెక్ట్ చేయటంతో దాదాపు అంతే బిజినెస్ జరిగింది. అడ్వాన్స్ బుక్కింగ్ లు చెప్పుకోదగినట్లుగా లేవు. మంచి టాక్ వస్తేనే రికవరీ ఉంటుంది.  

అలాగే ప్రేమ కావాలి ఫేమ్ ఆది హీరోగా నటించిన చిత్రం ‘శశి’. శ్రీనివాస్ నాయుడు రూపొందించిన ఈ చిత్రంలో ఆది సరసన సురభి నటిస్తున్నారు. ప్రేమలో పడ్డ ఓ మధ్యతరగతి కుర్రాడి ఇబ్బంది ఎలా ఉంటుంది? ప్రేమ తర్వాత కుటుంబంతో, స్నేహితులతో అతనికి రిలేషన్స్‌ ఎలా మారతాయి? అనే అంశాలతో ‘శశి’ సినిమా తెరకెక్కింది. ఈ సినిమాని రీజనబుల్ రేట్లకే అమ్మినట్లు సమాచారం. ఈ సినిమాలోని “ఒకే ఒక లోకం ” పాట పెద్ద హిట్టైంది. ఈ సినిమా థియోటర్ రైట్స్ 2.5 కోట్లు . అడ్వాన్స్ బుక్కింగ్ లు చెప్పుకోదగినట్లుగా లేవు. అయితే ఎక్కవ డబ్బు ఇన్వాల్వ్ కాలేదు కాబట్టి రికవరీ అయ్యే ఛాన్స్ ఉంది.  
 
ఇక ఐటి స్కామ్ నేపథ్యంలో వస్తున్న క్రైమ్ థ్రిల్లర్ మూవీ ‘మోసగాళ్లు’. ఇందులో కాజల్‌, మంచు విష్ణు అక్కాతమ్ముళ్లుగా నటిస్తున్నారు. జెఫ్రీ గీ చిన్‌ దర్శకత్వం వహించారు. ఏవీఏ ఎంటర్‌టైన్మెంట్, 24 ఫ్రేమ్స్‌ ఫ్యాక్టరీ బ్యానర్లపై మంచు విష్ణు నిర్మించి ఈ చిత్రం తెలుగు, తమిళ, మలయాళం, కన్నడ, హిందీ భాషల్లో శుక్రవారం విడుదల అవుతుంది. ఈ సినిమాకు బయ్యర్లు ఎవరూ ముందుకు రాలేదని తెలుస్తోంది. దాంతో సొంత రిలీజ్ పెట్టుకున్నారు.  అయితే పెట్టిన బడ్జెట్ ని బట్టి, మంచు విష్ణు చెప్పేదాన్ని బట్టి మినిమం డిస్ట్రిబ్యూటర్ షేర్ 20 కోట్లు సంపాదించాలి.  
 

Follow Us:
Download App:
  • android
  • ios