నితిన్‌ హీరోగా `మాచర్ల నియోజకవర్గం` చిత్రం రూపొందుతుంది. ఇందులో `ఉప్పెన` ఫేమ్‌ కృతి శెట్టి హీరోయిన్‌గా నటిస్తుంది. తాజాగా కేథరిన్‌ సెకండ్‌ హీరోయిన్‌గా నటించబోతుందని తెలుస్తుంది. 

కేథరిన్‌ థ్రెస్సా(Cetharine Tresa) ఒకప్పుడు తెలుగులో బ్యాక్‌ టూ బ్యాక్‌ సినిమాలు చేస్తూ ఊపిరాడకుండా చేసింది. తన అందాలతో మత్తెక్కించింది. ఇటీవల కాస్త సెలక్టీవ్‌గా సినిమాలు చేస్తున్న Cetharine Tresa మరో తెలుగు సినిమాకి కమిట్‌ అయ్యింది. నితిన్‌ సరసన హీరోయిన్‌గా నటించేందుకు గ్రీన్‌ సిగ్నల్‌ ఇచ్చింది. నితిన్‌తో ఫస్ట్ టైమ్‌ రొమాన్స్ చేసేందుకు రెడీ అవుతుంది. `మాచర్ల నియోజకవర్గం` చిత్రంలో కేథరిన్‌ హీరోయిన్‌గా ఎంపిక కావడం విశేషం. ఈ విషయాన్ని యూనిట్‌ మంగళవారం ప్రకటించారు. 

నితిన్‌(Nithiin) హీరోగా `మాచర్ల నియోజకవర్గం`(Macherla Niyojakavargam)చిత్రం రూపొందుతుంది. ఇందులో `ఉప్పెన` ఫేమ్‌ కృతి శెట్టి(Krithi Shetty)హీరోయిన్‌గా నటిస్తుంది. తాజాగా కేథరిన్‌ సెకండ్‌ హీరోయిన్‌గా నటించబోతుందని తెలుస్తుంది. ఇక ఎంఎస్‌ రాజశేఖర్‌రెడ్డి దర్శకత్వంలో రూపొందిన ఈ చిత్రాన్ని శ్రేష్ట్ మూవీస్‌ పతాకంపై సుధాకర్‌రెడ్డి, నికితా ఎడ్డి నిర్మిస్తున్నారు. పొలిటికల్‌ యాక్షన్‌ ఎంటర్‌టైనర్‌గా ఈ సినిమా సాగబోతుందని తెలుస్తుంది. చాలా రోజుల తర్వాత నితిన్‌ మరో యాక్షన్‌ సినిమాతో రాబోతున్నారని చెప్పొచ్చు. శరవేగంగా చిత్రీకరణ జరుపుకుంటోన్న ఈ సినిమా వచ్చే ఏడాది రిలీజ్‌ కాబోతుంది. 2022 ఏప్రిల్ 29న రిలీజ్‌ చేయబోతున్నట్టు ప్రకటించారు. 

2017లో వచ్చిన `నేనే రాజు నేనే మంత్రి` చిత్రంలో కీలక పాత్ర పోషించిన కేథరిన్‌ మూడేళ్ల తర్వాత గతేడాది `వరల్డ్ ఫేమస్‌ లవర్‌` చిత్రంలో ఓ హీరోయిన్‌గా మెరిసింది. విజయ్‌ దేవరకొండ సరసన రొమాంటిక్‌ పాత్రలో మెప్పించింది. ఇప్పుడు బ్యాక్‌ టూ బ్యాక్‌ మూడు తెలుగు సినిమాలు చేస్తుండటం విశేషం. అందులో భాగంగా `మాచర్ల నియోజకవర్గం`తోపాటు `బింబిసార`, `భళా తందనానా` సినిమాలు చేస్తుంది. ఈ సినిమాలతో మరోసారి తెలుగులో రాణించేందుకు గట్టి ప్రయత్నం చేస్తుంది కేథరిన్‌. 

also read: Samantha:చిక్కులన్నీ వీడినట్లే సూపర్ హ్యాపీగా కనిపిస్తున్న సమంత, క్లోజ్ ఫ్రెండ్ ప్రీతమ్ డిజైన్ చేసిన డ్రెస్ లో