నేడు రజనీకాంత్ నటించిన జైలర్ చిత్రం వరల్డ్ వైడ్ గా గ్రాండ్ గా రిలీజ్ అవుతున్న సంగతి తెలిసిందే. దీనితో అభిమానుల కోలాహలం తారా స్థాయికి చేరుతోంది.

దశాబ్దాలు గడుస్తున్నా సూపర్ స్టార్ రజనీకాంత్ పై అభిమానం చెక్కు చెదరడం లేదు. నేడు రజనీకాంత్ నటించిన జైలర్ చిత్రం వరల్డ్ వైడ్ గా గ్రాండ్ గా రిలీజ్ అవుతున్న సంగతి తెలిసిందే. దీనితో అభిమానుల కోలాహలం తారా స్థాయికి చేరుతోంది. రజని ఫ్యాన్స్ అంతా ఫస్ట్ డే మూవీ చూసేందుకు థియేటర్స్ కి ఎగబడుతున్నారు. 

నెల్సన్ దిలీప్ కుమార్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రంలో తమన్నా, రమ్యకృష్ణన్, వసంత్ రవి కీలక పాత్రల్లో నటించారు. రజనీకాంత్ ని ఆయన అభిమానులు ఒక ఆరాధ్య దైవంలాగా భావిస్తారు. తమిళనాట రజని చిత్రం రిలీజ్ అవుతుంటే ఉద్యోగులు సెలవులు పెట్టి మరీ సినిమాకి వెళతారు. ఇక కంపెనీలైతే స్వయంగా సెలవులు ప్రకటిస్తారు. ఇప్పుడు జైలర్ చిత్రానికి కూడా అదే జరుగుతోంది. 

కంపెనీలు ఉద్యోగులకు సెలవులు ఇవ్వడం వరకు ఒకే కానీ.. ఏకంగా కంపెనీ సీఈవో నే తన ఎంప్లాయీస్ కోసం 7 థియేటర్స్ బుక్ చేయడం మాములు విషయం కాదు. ఫ్రెష్ వర్స్క్ కంపనీ సీఈవో గిరీష్.. జైలర్ రిలీజ్ సందర్భంగా తన ఉద్యోగుల కిశోరం ఏకంగా జైలర్ చిత్ర 7 థియేటర్స్ బుక్ చేశాడు. తన ఉద్యోగులు 2200 మంది కోసం గిరీష్ టికెట్లు బుక్ చేసి జైలర్ చిత్రాన్ని ప్రత్యేకంగా ప్రదర్శించబోతున్నాడు. 

Scroll to load tweet…

ఈ విషయాన్ని గిరీష్ స్వయంగా ప్రకటించారు. ఫ్రెష్ వర్క్స్ అధినేతగా ఉన్న గిరీష్ సూపర్ స్టార్ రజనికి వీరాభిమాని. గతంలో కూడా గిరీష్ కబాలి, రోబో, లింగా లాంటి చిత్రాలకు ఇలాగె చేశారు. కేవలం తన కంపెనీ ఉద్యోగుల కోసమే రజనీపై అభిమానంతో జైలర్ ప్రత్యేక షో లని గిరీష్ ప్రదర్శిస్తున్నారు. ఫ్రెష్ వర్క్స్ కంపెనీకి హైదరాబాద్ చెన్నై, బెంగుళూరు నగరాలల్లో బ్రాంచీలు ఉన్నాయి. ఈ విషయం తెలుసుకున్న ఫ్యాన్స్ అంతా రజని అభిమానులందు గిరీష్ వేరయా అంటూ కామెంట్స్ పెడుతున్నారు.