ప్రస్తుతం ప్రపంచ వ్యాప్తంగా  ఓటీటీలకు పెరుగుతోన్న ఆదరణను ప్రముఖ దర్శకుడు రామ్ గోపాల్ వర్మ బాగానే క్యాష్ చేసుకున్నారు. ముఖ్యంగా గత నాలుగు నెలలుగా ఎంటర్టైన్మెంట్ కోసం ఎక్కువగా ఓటీటీలనే ఆశ్రయిస్తున్న వారినే ఆయన టార్గెట్ చేస్తున్నారు. అమెజాన్ ప్రైమ్ నెట్ ఫ్లిక్స్, డిస్నీ ప్లస్, హాట్ స్టార్ సన్ నెక్స్ట్ ఆల్ట్ బాలాజీ జీ 5 ఎం ఎక్స్ ప్లేయర్ ఎరోస్ ఆహా ఇలా వరసపెట్టి చాలా ఓటీటీ ఫ్లాట్ ఫార్మ్ రంగంలోకి దూకాయి. అయితే వీరందరికి కన్నా వర్మ కాస్తంత దూకుడుగా ఉన్నారు. 

 ఉన్నాయి. ఈ క్రమంలో ఓటీటీలలో వచ్చే ఒరిజినల్ మూవీస్ మరియు వెబ్ సిరీస్ లు వీక్షకులకు అందుబాటులో ఉంటున్నాయి. ఇప్పుడు ప్రపంచ వ్యాప్తంగా నెలకొనివున్న పరిస్థితుల వలన క్రేజీ మూవీస్ కూడా ఈ ఓటీటీలలో డైరెక్ట్ గా రిలీజ్ చేస్తున్నా. అయితే ఓటీటీలలో వచ్చే కంటెంట్ మీద అదే స్థాయిలో విమర్శలు కూడా వస్తున్నాయి. వెబ్ కంటెంట్ కి సెన్సార్ కూడా లేకపోవడంతో వర్మ రెచ్చిపోయి అస్లీల దృశ్యాలు.. అస్లీల కంటెంట్ చూపిస్తూ డబ్బు చేసుకుంటున్నారు. దీంతో ఫ్యామిలీతో కలిసి ఓటీటీలలో వచ్చే కంటెంట్ ని చూడలేని పరిస్థితులు మాత్రమే కాకుండా యూత్ ని పెడదారి పట్టించే విధానం కూడా ఈ క్రమంలో జరుగుతోంది. డైరక్ట్ ఫోర్న్ చూస్తున్న మాదిరిగా ఆయన సినిమాలు క్లైమాక్స్, నగ్నం ఉన్నాయని విమర్శలు వచ్చాయి. ఇదే పద్దతిని ఆయన కంటిన్యూ చేయబోతున్నారు. అంతేకాదు ఆయన్ను అనుకరిస్తూ మరికొంతమంది రంగంలోకి దిగి బూతుని, క్రైమ్ ని కుప్పలుగా పోసేందుకు రెడీ అవుతున్నారు. ఈ విషయాలను కేంద్రం నిశితంగా పరిశీలిస్తోంది. 

తాజాగా కేంద్ర మంత్రి పీయూష్ గోయల్ కూడా ఇదే అభిప్రాయాన్ని వ్యక్తం చేసారు. ఈ సందర్భంగా ఓటీటీ ప్లాట్ ఫార్మ్స్ లో యథేచ్ఛగా అసభ్య కంటెంట్ ప్రసారం కావడంపై అసంతృప్తి వ్యక్తం చేసారు. వెబ్ కంటెంట్ కుటుంబంతో కలిసి చూసే పరిస్థితి లేకుండా పోయిందని అన్నారు. అంతేకాకుండా విదేశీ కంటెంట్ అనువాదానికి కూడా ఓ హద్దు ఉంటుందని.. మన దేశ సంస్కృతీ సాంప్రదాయాలు సమాజం నైతిక విలువలు దృష్టిలో పెట్టుకొని అనువాదాలు చేయాలని అభిప్రాయపడ్డారు. ఇక ఓటీటీ ప్లాట్ ఫార్మ్స్ లో స్వీయ నియంత్రణ ఉండాలని పేర్కొన్నారు. సెంట్రల్ మినిస్టర్ వ్యాఖ్యలు చూస్తుంటే త్వరలోనే వెబ్ కంటెంట్ మీద రూల్స్ పెట్టే ఆలోచన చేస్తున్నారన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది.

ఇదే కనుక జరిగితే రామ్ గోపాల్ వర్మలాంటి అసభ్య కంటెంట్ చూపించే మేకర్స్ కి ఇబ్బందిగా మారే అవకాశాలు ఉన్నాయి. ఇప్పటిదాకా ఓటీటీ కంటెంట్ కి ఎలాంటి రూల్స్  లేకపోవడంతో వర్మ దానిని క్యాష్ చేసుకుంటున్నారు. అందు కోసం సొంతంగా 'ఆర్జీవీ వరల్డ్ థియేటర్' అనే ఏటీటీ ఫ్లాట్ ఫార్మ్ క్రియేట్ చేసి దాంట్లో అండల్ట్ కంటెంట్ వదులుతున్నారు.  అంతేకాకుండా రాబోయే రోజుల్లో వీటికి మించి అసభ్య కంటెంట్ చూపించడానికి సిద్దపడుతున్నారు. ఈ క్రమంలో కేంద్ర మంత్రి చెప్పినట్లు నియంత్రణ చేస్తే రామ్ గోపాల్ వర్మ లాంటి మేకర్స్ కి చెక్ పెట్టినట్లే అని అభిప్రాయపడుతున్నారు.