కరోనా వైరస్ కారణంగా ఐదు నెలలుగా చిత్ర పరిశ్రమ స్థంభించి పోయింది. దేశంలోని అన్ని పరిశ్రమల నుండి చిత్ర నిర్మాణం ఆగిపోయింది. ఐతే బాలీవుడ్ లో ఇప్పుడే చిత్ర నిర్మాణం మొదలైంది. హీరో అక్షయ్ కుమార్ బెల్ బాటమ్ మూవీ షూటింగ్ కొరకు లండన్ వెళ్లినట్లు సమాచారం ఉంది. ఇక దేశీయంగా కూడా అన్ని చిత్రాల షూటింగ్స్ మొదలుకానున్నాయి. 

ఈ నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం కరోనా సోకకుండా కొన్ని నిర్దిష్టమైన మార్గదర్శకాలు విడుదల చేసింది. షూటింగ్ సెట్స్ లో ప్రాథమికంగా పాటించాల్సిన నియమాలు విడుదల చేయడం జరిగింది. కేంద్ర కమ్యూనికేషన్ అండ్ బ్రాడ్ కాస్టింగ్ మినిస్టర్ ప్రకాష్ జవదేకర్ సూచనలు విడుదల చేశారు. షూటింగ్ జరిగే ప్రదేశంలోని ఎంట్రన్స్ లో థర్మల్ స్క్రీనింగ్, యూనిట్ లోని ప్రతి సభ్యుడు పేస్ మాస్క్, షీల్డ్ మరియు శానిటైజర్స్ ఉపయోగించడం మరియు ఆరు అడుగుల భౌతిక దూరం పాటించాలని సూచించడం జరిగింది. 

చిత్ర యూనిట్ సూచించిన భద్రతా నియమాలు పాటించాల్సివుంది. దేశంలో పూర్తిగా లాక్ డౌన్ ఎత్తి వేయనున్నారు. సినిమా థియేటర్స్ కూడా త్వరలో తెరుచుకోనున్నాయి. త్వరలో గతంలో వలె సినిమా కళ సంతరించుకోనుంది.