కాజల్ అగర్వాల్ టాలీవుడ్ లో స్టార్ హీరోయిన్ గా గుర్తింపు తెచ్చుకుంది. ఆమె ఇండస్ట్రీకి వచ్చి పదేళ్లు దాటిపోయింది. ఇన్నేళ్లలో నటనకి ప్రాధాన్యమున్న పాత్రలో పాటు గ్లామరస్ రోల్స్ కూడా చేసింది. అయితే ఎప్పుడూ కూడా హద్దులు దాటి బోల్డ్ గా నటించలేదు.

బాలీవుడ్ లో కూడా ఆమె సినిమాలు చేసింది కానీ బోల్డ్ గా కనిపించలేదు. కానీ ఆమె నటిస్తోన్న తాజా చిత్రంలో మాత్రం రెచ్చిపోయి నటించిందట. బాలీవుడ్ లో సక్సెస్ అయిన 'క్వీన్' సినిమాను సౌత్ లాంగ్వేజెస్ లో రీమేక్ చేస్తోన్న సంగతి తెలిసిందే.

తెలుగులో తమన్నా, తమిళంలో కాజల్, కన్నడలో పారుల్ యాదవ్, మలయాళంలో మంజిమా మోహన్ లతో రీమేక్ చేస్తున్నారు. ఈ సినిమా అన్ని భాషల టీజర్లలో కాజల్ టీజర్ కి 
క్రేజ్ వచ్చింది. దానికి కారణం ఆమె టీజర్ లో ఓ బోల్డ్ సన్నివేశం. కాజల్ ఛాతి భాగాన్ని మరో నటి పట్టుకొనే దృశ్యం సోషల్ మీడియాలో బాగా వైరల్ అయింది.

టీజర్ లో చూపించిన ఈ ఒక్క షాట్ లోనే కాదు.. సినిమాలో కూడా కాజల్ బాగా రెచ్చిపోయిందట. దీంతో ఈ చిత్రానికి సెన్సార్ క్లియరన్స్ వస్తుందా..? రాదా..? అనే సందేహం నెలకొందట.

పాత్రకి అవసరమంటూ కాజల్ కూడా కన్విన్స్ అయి సినిమాలో కొన్ని బోల్డ్ సీన్స్ లో నటించిందట. అయితే ఆ సన్నివేశాలను సెన్సార్ సభ్యులు యాక్సెప్ట్ చేస్తారా అనేది మాత్రం డౌటేనట. ఒకవేళ ఆ సన్నివేశాలను తొలగించమని చెబితే మాత్రం వాటిని యూట్యూబ్ లో రిలీజ్ చేయాలని చూస్తున్నారు.