దర్శకుడు రామ్ గోపాల్ వర్మకు సెన్సార్ బోర్డు సభ్యులు గట్టి షాక్ ఇచ్చినట్లు తెలుస్తుంది. ఆయన తెరకెక్కించిన వివాదాస్పద చిత్రం దిశా ఎన్కౌంటర్ కి సెన్సార్ సర్టిఫికెట్ నిరాకరించినట్లు సమాచారం. దీనితో దిశా ఎన్కౌంటర్ చిత్రాన్ని థియేటర్స్ లో విడుదల చేయాలనుకున్న వర్మ ప్లాన్స్ కి గండిపడినట్లు అయ్యింది. జనరల్ గా వైలెంట్ కంటెంట్ అధికంగా ఉన్న చిత్ర చిత్రాలకు 'ఏ' సర్టిఫికేట్ జారీ చేస్తారు.  అసలు పూర్తిగా సర్టిఫికెట్ నిరాకరించడానికి వర్మ దిశా ఎన్కౌంటర్ సినిమాలో ఏమి చూపించాడో తెలియాల్సి ఉంది. 

2019లో హైదరాబాద్ శివార్లలో జరిగిన దిశా మానభంగం మరియు హత్య కేసు దేశవ్యాప్తంగా సంచలనం రేపింది. నలుగురు యువకులు వెటర్నరీ డాక్టర్ దిశాను ట్రాప్ చేయడంతో పాటు, ఆమెను మానభంగం చేసి హత్య చేశారు. ఈ కేసును సీరియస్ గా  తీసుకున్న పోలీసులు ఘటన జరిగిన గంటల వ్యవధిలో నిందితులను పట్టుకోవడం జరిగింది. అరెస్ట్ కాబడిన నలుగురు యువకులు మరుసటి రోజు ఎన్కౌంటర్ చేయబడ్డారు. ఈ ఎన్కౌంటర్ పై అప్పట్లో భిన్న అభిప్రాయాలు వెలువడ్డాయి. 

కాగా ఈ సంఘటనపై మూవీ చేస్తున్నట్లు వర్మ ప్రకటించిన నాటి నుండి ఇది ఒక వివాదంగా మారింది. దిశా తల్లిదండ్రులు ఈ సినిమా తెరకెక్కించాడన్ని వ్యతిరేకించడం జరిగింది. అలాంటివి లెక్క చేయని వర్మ దిశా మూవీ తెరకెక్కించడం జరిగింది. చివరి నిమిషంలో దిశా విడుదల కాకుంగా సెన్సార్ సభ్యులు బ్రేక్ వేశారు.