స్టార్ హీరోయిన్ రకుల్ ప్రీత్ సింగ్ దక్షిణాదిలో నటిస్తూనే బాలీవుడ్ లో కూడా తన అదృష్టాన్ని పరీక్షించుకుంటోంది. రకుల్ ప్రీత్ సింగ్ నటించిన బాలీవుడ్ చిత్రం దే దే ప్యార్ దే శుక్రవారం రోజు ప్రేక్షకుల ముందుకు రానుంది. యాక్షన్ హీరో అజయ్ దేవగన్, టబు, రకుల్ నటించిన ఈ రొమాంటిక్ ఎంటర్టైనర్ పై మంచి అంచనాలు ఉన్నాయి. ఈ చిత్రంలో రకుల్ ప్రీత్ సింగ్ ఎన్నడూ లేని విధంగా అందాలు ఆరబోస్తూ రెచ్చిపోయింది. 

సౌత్ చిత్రాల్లో కూడా రకుల్ గ్లామరస్ గా కనిపించింది. కానీ ఈ స్థాయిలో ఎక్స్ ఫోజింగ్ ఎప్పుడూ చేయలేదు. ఈ చిత్రంలోని ఓ సాంగ్ లో రకుల్ అందాల ఆరబోస్తూ మద్యం బాటిల్ చేతిలో పట్టుకుని హాట్ హాట్ గా డాన్స్ చేసింది. ఈ సన్నివేశం మరీ అసభ్యకరంగా ఉందని సెన్సార్ సభ్యులు అభ్యంతరం వ్యక్తం చేశారట. ఆ సన్నివేశం తొలగించాలి లేదా మద్యం బాటిల్ స్థానంలో పూలు పట్టుకుని ఉన్నట్లుగా గ్రాఫిక్స్ చేయాలని సూచించనినట్లు తెలుస్తోంది. 

ఈ చిత్రంలో అజయ్ దేవగన్ 50 ఏళ్ల వ్యక్తిగా నటిస్తున్నాడు. టబు అతడి నుంచి విడిపోయిన భార్య పాత్రలో నటిస్తోంది. ఇక రకుల్ ప్రీత్ సింగ్ పాతికేళ్ల యువతి పాత్రలో నటిస్తోంది. ఆమె ప్రేమలో అజయ్ దేవగన్ పడ్డ తర్వాత కథ ఎలాంటి మలుపులు తిరిగిందనేదే ఈ చిత్రంలో ఆసక్తికర అంశం. అకివ్ అలీ ఈ చిత్రానికి దర్శకుడు. 

ఏషియా నెట్ న్యూస్ లో ఎన్నికల తాజా వార్తలు, విశ్లేషణలు.. ఇక్కడ క్లిక్ చేయండి