సీనియర్ హీరోయిన్ త్రిష నటించిన సినిమాకి సెన్సార్ బోర్డ్ షాక్ ఇచ్చింది. కోలీవుడ్ లో ప్రస్తుతం ఈ బ్యూటీ చాలా బిజీగా గడుపుతోంది. ఆమె చేతిలో అరడజనుకి పైగా సినిమాలు ఉన్నాయి. ఇటీవల ఆమె నటించిన '96' సినిమా భారీ విజయాన్ని అందుకున్న సంగతి తెలిసిందే. 

ప్రస్తుతం ఆమె నటిస్తోన్న సినిమాల్లో 'పరమపదం విలయాట్టు' సినిమా ఒకటి. ఇదొక హీరోయిన్ ఓరియెంటెడ్ సినిమా. ఇందులో త్రిష తల్లిగా నటించింది. పగ, ప్రతీకారాలతో కూడిన ఈ సినిమాలో త్రిష యాక్షన్ సీన్స్ లో కూడా నటించింది. సినిమా నిర్మాణ కార్యక్రమాలు పూర్తి చేసుకొని సెన్సార్ కి వెళ్లింది.

ఇది కుటుంబ కథా చిత్రం కాబట్టి సెన్సార్‌ నుంచి యూనిట్‌ వర్గాలు యు సర్టిఫికెట్‌ను ఆశించారు. అయితే సెన్సార్‌ బోర్డు వారికి షాక్‌ ఇచ్చింది. యు/ఏ సర్టిఫికెట్‌ను ఇచ్చిందని  తెలుస్తోంది. దీంతో యూనిట్ షాక్ అయిందట. సెన్సార్ సభ్యులను ఈ విషయంపై ప్రశ్నించగా.. హారర్ నేపధ్యంలో తెరకెక్కిన యాక్షన్ థ్రిల్లర్ కావడంతో యు సర్టిఫికేట్ ను ఇవ్వలేమని సెన్సార్ సభ్యులు చెప్పినట్లు సమాచారం.

మరికొద్ది రోజుల్లో సినిమా ట్రైలర్ విడుదల చేసి వచ్చే నెలలో సినిమాను విడుదల చేయడానికి చిత్రబృందం ప్లాన్ చేస్తోంది. ప్రస్తుతం త్రిష 'రాంగీ' అనే మరో ఫిమేల్ ఓరియెంటెడ్ సినిమాలో నటిస్తోంది.