Asianet News TeluguAsianet News Telugu

శోకసంద్రంలో భారత చలనచిత్ర సీమ ట్వీట్లతో సంతాపం

  • బాలీవుడ్, టాలీవుడ్,కోలీవుడ్  ట్వీట్స్ తో సంతాపం తెలిపిన ప్రముఖులు
celebrities Tweets on Sridevi Death

 అతిలోక సుందరి శ్రీదేవి హఠాన్మరణంతో సినీలోకం విషాదంలో మునిగిపోయింది. ఆదివారం ఉదయం నిద్రలేవగానే ఈ విషయం తెలుసుకున్న సినీ జగత్తు షాక్ కు గురైంది. ఈ విషాద వార్త విని సినీ ప్రముఖులు కంటతడిపెడుతున్నారు. 

  
తమిళ సూపర్ స్టార్ రజనీకాంత్ శ్రీదేవి కుటుంబ సభ్యులకు ఆయన ప్రగాఢ సానుభూతి ప్రకటించారు. శ్రీదేవి హఠాన్మరణం తీవ్ర దిగ్భ్రాంతికి గురి చేసిందని రజనీకాంత్ అన్నారు. తాను ఓ మంచి స్నేహితురాలిని కోల్పోయానన్నారు.  శ్రీదేవి  మృతితో సినీ పరిశ్రమ లెజెండ్ ను కోల్పోయిందని అన్నారు.


మరో తమిళ నటుడు కమల్ కూడా తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. టీనేజర్ నుంచి అద్భుతమైన మహిళగా శ్రీదేవి ఎదిగిన తీరు తనకు తెలుసని చెబుతూ ఆమెతో తనకున్న అనుబంధాన్నిగుర్తు చేసుకున్నారు.
    
శ్రీదేవి మరణించారన్న వార్త తనను తీవ్ర విషాదంలోకి నెట్టి వేసిందంటూ బిగ్ బి అమితాబ్ ట్వీట్ చేశారు. ఆమె కుటుంబ సభ్యులకు తన ప్రగాఢ సానుభూతి తెలిపారు.

ఒక సావిత్రి - భానుమతి వంటి గొప్ప నటులతో తప్ప శ్రేదేవిని ఇంకెవరితోనూ పోల్చనేలేమని రెబల్ స్టార్ కృష్ణంరాజు అన్నారు. అందం అభినయంతో పాటు పెద్దలు - సీనియర్ల పట్ల గౌరవం - జీవితంలో తిరుగులేని క్రమశిక్షణ ఆమెకున్న గొప్ప లక్షణాలని - మంచి వ్యక్తిత్వమని ఆయన అన్నారు.

రాఘవేంద్రరావు: శ్రీదేవి మరణ వార్త తీవ్ర విషాదంలో ముంచేసింది. 

కోదండరామిరెడ్డి:  నా జీవితంలోనే అతి పెద్ద షాకింగ్ న్యూస్ ఇది. ఎలాంటి పాత్రనైనా అలవోకగా పోషించి మెప్పించగల సత్తా శ్రీదేవి సొంతం.

జూనియర్ ఎన్టీఆర్: ఆమె స్వర్గం నుంచి వచ్చి మన చిత్రసీమను ఏలి తిరిగి వెళ్లిపోయింది. 

జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ శ్రీదేవి మరణాన్ని నమ్మలేకపోతున్నానన్నారు. దుబాయిలో వివాహానికి వెళ్ళిన శ్రీదేవిగారు చనిపోయారని తెలియగానే దిగ్భ్రాంతికి లోనయ్యానని తెలిపారు. ‘‘అసమానమైన అభినయంతో భారత ప్రేక్షక లోకం అభిమానాన్ని ఆమె చూరగొన్నారు. శ్రీదేవి గారు ఇక లేరు అనే మాట నమ్మలేనిది... కానీ ఆమె వెండి తెరపై పోషించిన భిన్నమైన పాత్రలన్నీ చిరస్మరణీయాలే’’ అని పవన్ అన్నారు. బడి పంతులు సినిమాలో బాల నటిగా ‘బూచాడమ్మ బూచాడు’ అనే పాటలో కళ్ళు అటూ ఇటూ తిప్పుతూ పలికింఛిన హావభావాల్ని ఆయన గుర్తుచేసుకున్నారు. పవన్ అన్నయ్య చిరంజీవితో శ్రీదేవి నటించిన చిత్రాలను - వాటిలోని అద్భుత సన్నివేశాలను గుర్తుచేసుకున్న ఆయన శ్రీదేవి మృతి తీరని లోటన్నారు.
శృతిహాసన్: ఆమె మరణంతో నా  గుండెపగిలిపోయింది.  శ్రీదేవి లాంటి ఒక గొప్ప నటి తన అభినయంతోనూ అందంతోనూ ఇతురలతో కలిసి మెలిసి పనిచేయడాన్ని చూడటం నాకు లభించిన ఓ గౌరవం.
 
కాజల్: ఆమె అంటే నాకు ప్రాణం. ఆమే నా 'రోల్ మోడల్'

రకుల్ ప్రీత్ సింగ్: నేనీ వార్త నమ్మను. నా హృదయం రోదిస్తోంది. 
    
ఇక టాలీవుడ్ కి చెందిన ఇతర నటీనటులు కూడా శ్రీదేవి మృతికి సంతాపం వ్యక్తం చేశారు. సీనియర్ నటుడు - రాజమండ్రి ఎంపీ మురళీమోహన్ - ప్రముఖ హీరోలు ఎన్ టీఆర్ - పవన్ కళ్యాణ్ - రవితేజ - నాగశౌర్య - సుధీర్ బాబు - సంగీత దర్శకుడు దేవిశ్రీ ప్రసాద్ - రామ్ చరణ్ సతీమణి ఉపాసన కొణిదెల - కమెడియన్ వెన్నెల కిశోర్ - హీరోయిన్ అనుపమ పరమేశ్వరన్ తదితరులు తీవ్ర దిగ్భ్రాంతిని వ్యక్తం చేశారు.

Follow Us:
Download App:
  • android
  • ios