ఎప్పుడు మొదలవుతుందో ఎక్కడ మొదలవుతుందో తెలియదు గాని కార్చిచ్చు లు జీవితాలను ఒక్కసారిగా మార్చేస్తాయి. ఏడాదికో కార్చిచ్చుకు గురయ్యే అమెరికా అడవిప్రాంత నగరాల్లో ఈ సారి సౌత్ కాలిఫోర్నియా చాలా వరకు అగ్నికి ఆహుతయ్యింది. ఊహించని విధంగా అగ్నిహొలాలు ఇళ్లను మింగేశాయి. 

దాదాపు 175 ఇల్లు మంటల్లో కలిసిపోయి బూడిదయ్యాయి. ఫైర్ ఫైటర్స్ సకాలంలో స్పందించి మంటలను అదుపుచేయడంతో చాలా వరకు ఆస్థి నష్టం తగ్గింది. ఇక మంటల కారణంగా ప్రముఖ పాప్ సింగర్ మిల్లీ సైరస్, రాబిన్ థిక్స్, గెరార్డ్ బట్లర్, లేడీ గాగా - ఓర్లాండో బ్లూమ్స్ వంటి హాలీవుడ్ ప్రముఖుల ఇల్లు కాలి బూడిదయ్యాయి. 

ఫైర్ ఫైటర్స్ కారణంగా తాము ప్రాణాలతో బయటపడ్డట్లు చాలా మంది సినీ తారలు మీడియా ముందుకు వచ్చి వివరణ ఇచ్చారు. వందలదికి పైగా ఫైర్ సిబ్బంది ఈ ఘటనలో సామాన్యులను కాపాడారు. ఇక మంటలు పూర్తిగా ఆరిపోయే వరకు ఫైర్ సిబ్బంది పరిసర ప్రాంతాల నుంచి విడిచి వెళ్ళలేదు.