బాలీవుడ్ హీరో సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ ఆత్మహత్య కేసులో సీబీఐ దర్యాప్తు వేగవంతం చేసింది. అటాప్సీ సరిగా నిర్వహించలేదని సందేహాలు వ్యక్తమవుతున్నాయి. సుశాంత్ మరణ సమయాన్ని అటాప్సీ రిపోర్టులో పేర్కొనకపోవడంపై పలు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు సీబీఐ అధికారులు.

సీబీఐ రెండు బృందాలుగా విడిపోయి దర్యాప్తు చేస్తోంది. సుశాంత్ ఇంటికి చేరుకున్న ఓ బృందం సీన్ రీకన్‌స్ట్రక్షన్ చేస్తోంది. ఇంటి పనిమినిషి, సుశాంత్ ఫ్లాట్ మేట్ ఇచ్చిన ఆధారాల మేరకు సీన్ రీకన్‌స్ట్రక్షన్ చేస్తున్నారు.

ఇక మరో బృందం కూపర్ ఆసుపత్రికి వెళ్లింది. ఎక్కడైతే సుశాంత్ పోస్ట్‌మార్టం జరిగిందో అక్కడకి వెళ్లి మరికొంత సమాచారాన్ని సేకరిస్తోంది. అవసరమైతే మరో కేసు ఫైల్ చేయాలని సుప్రీంకోర్టు ఆదేశాలు జారీ చేయడంతో సీబీఐ దర్యాప్తు వేగంగా జరుగుతోంది.

కాగా మనీలాండరింగ్ కేసులో పనిమనిషితో పాటు సుశాంత్ మాజీ మేనేజర్‌గా చెప్పుకుంటున్న సిద్ధార్ధ్ పితానిని గతంలోనే మనీలాండరింగ్ కేసులో ఈడీ విచారించింది.

కాగా సుశాంత్ మృతదేహాన్నిఉంచిన మార్చురీలో రియా చక్రవర్తి అధికారిక అనుమతి లేకుండానే 45 నిమిషాల పాటు ఎలా గడిపిందన్న విషయాన్ని కూడా నిగ్గు తేల్చే ప్రయత్నం చేశారు.