దర్శకుడు బోయపాటి శ్రీనివాస్ కొంతమంది నటీనటులను స్పెషల్ గా ట్రీట్ చేస్తుంటారు. అందులో హీరోయిన్ క్యాథరిన్ ఒకరు. బోయపాటి తెరకెక్కించిన 'సరైనోడు' సినిమాలో హీరోయిన్ గా క్యాథరిన్ కనిపించింది. అప్పటివరకు క్యాథరిన్ కి పెద్దగా ఫాలోయింగ్ ఉండేది కాదు.. 

దర్శకుడు బోయపాటి శ్రీనివాస్ కొంతమంది నటీనటులను స్పెషల్ గా ట్రీట్ చేస్తుంటారు. అందులో హీరోయిన్ క్యాథరిన్ ఒకరు. బోయపాటి తెరకెక్కించిన 'సరైనోడు' సినిమాలో హీరోయిన్ గా క్యాథరిన్ కనిపించింది. 

అప్పటివరకు క్యాథరిన్ కి పెద్దగా ఫాలోయింగ్ ఉండేది కాదు.. కానీ 'సరైనోడు' సినిమాతో ఆమెకి మంచి క్రేజ్ దక్కింది. అప్పటినుండి బోయపాటితో క్యాథరిన్ కి ప్రత్యేకమైన బంధం ఏర్పడింది. బెల్లంకొండ శ్రీనివాస్ హీరోగా బోయపాటి రూపొందించిన 'జయ జానకి నాయక' సినిమాలో క్యాథరిన్ ని రిపీట్ చేశారు.

అయితే హీరోయిన్ పాత్ర మాత్రం ఇవ్వలేకపోయాడు. ఐటెం సాంగ్ లో క్యాథరిన్ పెర్ఫార్మన్స్ చూపించారు. ఇప్పుడు ఆయన రూపొందిస్తోన్న 'వినయ విధేయ రామ' సినిమాలో కూడా క్యాథరిన్ కి ఛాన్స్ ఇచ్చినట్లు తెలుస్తోంది. ఈ సినిమాలో కియారా అద్వానీ హీరోయిన్ గా నటిస్తోన్న సంగతి తెలిసిందే.

అయితే ఐటెం సాంగ్ కోసం స్టార్ హీరోయిన్ ని తీసుకోవాలని భావించారు. ఈ క్రమంలో రకుల్, కాజల్ ఇలా చాలా హీరోయిన్ల పేర్లు వినిపించాయి. రీసెంట్ గా ఇలియానా పేరు కూడా తెరపైకి వచ్చింది. కానీ ఆమె ఎక్కువ రెమ్యునరేషన్ డిమాండ్ చేయడంతో పక్కన పెట్టేశారు.

ఇప్పుడు ఫైనల్ గా క్యాథరిన్ ని ఎంపిక చేసినట్లు తెలుస్తోంది. అది కూడా బోయపాటి ఆలోచనే అని సమాచారం. మొత్తానికి క్యాథరిన్ బోయపాటితో మూడోసారి కలిసి పని చేయనుంది!