ఐటమ్ గర్ల్ గా మారిన ఎమ్మెల్యే పాప
- ఐటమ్ గర్ల్ అవతారమెత్తనున్న ఎమ్మెల్యే పాప
- అదే నండీ సరైనోడులో బన్నీతో డ్యూయెట్ పాడిన ఎమ్మెల్యే
- ఈ పాటికే మీకు అర్థమైంది కదా... అవును కేథరిన్ ట్రెసానే
మెగాస్టార్ చిరంజీవి బాస్ ఈజ్ బ్యాక్ అంటూ వచ్చిన ఖైదీ నెంబర్ 150లో బాస్ సరసన స్టెప్పులేయాల్సింది కాస్తా... చిన్న మిస్టేక్ తో ఆవకాశం చేజార్చుకుంది. సరైనోడులో ఎమ్మెల్యే పాపగా తెలుగు ప్రేక్షకులను, అల్లు అర్జున్ ను ఎంతగానో అలరించిన కేథరిన్ మెగా ఆఫర్ కోల్పోయినా... మరో క్రేజీ ఆఫర్ రావటంతో దానికి ఓకే చెప్పింది. హీరోయిన్‌గా నటిస్తూ క్రేజీ స్టార్ గా వెలుగొందుతున్న కేథరిన్ ప్రత్యేక పాటకు సినిమాలో చాలా స్పెషాల్టీ ఉండటంతో గ్రీన్ సిగ్నల్ ఇచ్చేసింది.
కేథరిన్ అంగీకరించిన స్పెషల్ సాంగ్ బెల్లంకొండ శ్రీనివాస్ హీరోగా బోయపాటి దర్శకత్వంలో మిర్యాల రవీందర్‌రెడ్డి చిత్రంలోనిదే. ఇందులో రకుల్ ప్రీత్‌సింగ్, ప్రగ్యా జైస్వాల్ కథానాయికలుగా నటిస్తున్నారు. అయితే ఈ చిత్రంలోనే కేథరిన్ ప్రత్యేక పాటలో మెరవనున్నారు.
‘అల్లుడు శీను’, ‘స్పీడున్నోడు’ చిత్రాల్లో బెల్లంకొండ పక్కన తమన్నా ప్రత్యేక గీతాలతో కుర్రకారును ఊర్రూతలూగించిన విషయం తెలిసిందే. తాజా చిత్రంలో కేథరిన్ చేయనున్న ఐటమ్ సాంగ్ వాటికి ధీటుగా చాలా గ్రాండ్‌గా ఉంటుందని నిర్మాత పేర్కొన్నారు. ఈ ప్రత్యేక పాట కోసం హైదరాబాద్‌లోని ఓ స్టూడియోలో ఇప్పటికే భారీ సెట్ సిద్ధం చేశారు. దేవిశ్రీ ప్రసాద్ ఈ చిత్రానికి సంగీతం అందిస్తుండటంతో ప్రత్యేక పాట ట్యూన్ ఓ రేంజ్‌లో ఉంటుందని ఊహించొచ్చు.