ఎన్టీఆర్‌,  రామ్‌చ‌ర‌ణ్ కాంబినేష‌న్‌లో..  ఎస్‌.ఎస్‌.రాజ‌మౌళి రూపొందిస్తున్న చిత్రం ‘ఆర్ఆర్ఆర్’. ఈ చిత్రం ప్రారంభరోజు నుంచి అంచనాలు బిల్డ్ అవటం మొదలయ్యాయి. రాజమౌళి మళ్లీ ఏం మ్యాజిక్ చెయ్యబోతున్నారు. 

ఎన్టీఆర్‌, రామ్‌చ‌ర‌ణ్ కాంబినేష‌న్‌లో.. ఎస్‌.ఎస్‌.రాజ‌మౌళి రూపొందిస్తున్న చిత్రం ‘ఆర్ఆర్ఆర్’. ఈ చిత్రం ప్రారంభరోజు నుంచి అంచనాలు బిల్డ్ అవటం మొదలయ్యాయి. రాజమౌళి మళ్లీ ఏం మ్యాజిక్ చెయ్యబోతున్నారు. ఎన్టీఆర్ , చరణ్ లు ఈ సినిమాలో ఏ గెటప్ లో కనిపించబోతున్నారు వంటి విషయాలపై డిస్కషన్స్ అభిమానులు మధ్య మొదలైంది. ఈ నేపధ్యంలో సినిమా లాంచ్ అవ్వడం, ఫస్ట్ షెడ్యూల్ పూర్తవడం వంటివి శరవేగంగా జరిగిపోయింది. 

రీసెంట్ గా ‘ఆర్ఆర్ఆర్’సినిమా నుంచి ఎన్టీఆర్ లుక్ అంటూ లావుగా ఉన్న ఎన్టీఆర్ ఫొటో వైరల్ అయ్యింది. ఆ తర్వాత ఎన్టీఆర్ పర్శనల్ కోచ్ వచ్చి వివరణ ఇచ్చేదాకా దానికి బ్రేక్ పడలేదు. రీసెంట్‌గా తెలంగాణలో జరిగిన ఎన్నికలలో ఓటు వేసేందుకు యంగ్‌టైగర్ ఎన్టీఆర్.. తన భార్యతో కలిసి వచ్చినప్పుడు ఆయన లుక్ పై మరోసారి డిస్కషన్ మొదలైంది. 

ఇప్పుడు మరొక్కసారి యంగ్ టైగర్ ఎన్టీఆర్ తన భార్య, ఫ్రెండ్‌తో కలిసి ఉన్న ఫొటోలు నెట్‌లో దర్శనమిచ్చాయి. దీంతో ఖచ్చితంగా ఆర్ఆర్ఆర్‌లో ఎన్టీఆర్ లుక్ ఇదేనంటూ నెటిజన్లు ఈ ఫొటోలను షేర్ల మీద షేర్లు చేస్తూ.. ఆర్ఆర్ఆర్‌ను మరోసారి ట్రెండింగ్‌లోకి తీసుకువస్తున్నారు. ఈ ఫొటోలో ఎన్టీఆర్ చాలా సన్నగా ఉన్నారు. గెడ్డం పెంచారు. మరి ఈ లుక్ అయినా సినిమాలో లుక్ అవుతుందా లేదా వేరొకటా అనేది తేలేదాకా ఇలా వార్తలు చదువుకుంటూండటమే.