ప్రముఖ నిర్మాత ఏక్తా కపూర్ రూపొందిస్తోన్న 'ఫిక్సర్' అనే వెబ్ సిరీస్ షూటింగ్ జరుగుతుండగా.. కొందరు గుర్తు తెలియని వ్యక్తులు చిత్రబృందంపై దాడి చేశారు. నటి తిగ్మాంషు ధులియా దాడికి సంబంధించిన వివరాలను తెలియజేస్తూ.. ఓ వీడియోను తన ట్విట్టర్ లో షేర్ చేశారు.

తమపై దాడి ఎలా జరిగిందనే విషయాన్ని వెల్లడించారు. షూటింగ్ జరుగుతుండగా.. నలుగురైదుగురు యువకులు కర్రలతో తమ దగ్గరకు వచ్చి దాడి చేశారని, మొదటి కామెడీ అనుకుంటే నిజంగానే దాడి చేయడంతో ఖంగుతున్నట్లు చెప్పారు.

ఈ దాడిలో దర్శకుడు సోహమ్ షా కింద పడిపోయాడని, ఓ కెమెరామెన్ కి తీవ్ర గాయాలయ్యాయని చెప్పారు. తమ మీద దాడి చేసిన వారు ఆ ప్రాంతంలో రౌడీలుగా చెలామణి అవుతున్నారని చెప్పారు. వారి అనుమతి లేకుండా అక్కడ షూటింగ్ చేయకూడదని సదరు గ్యాంగ్ తమను హెచ్చరించిందని నటి ధులియా చెప్పారు.

అయితే షూటింగ్ చేయడానికి ముందే పర్మిషన్ తీసుకున్నామని, దానికి సంబంధించిన డబ్బు కూడా చెల్లించామని దర్శకుడు సోహమ్ షా వెల్లడించారు.