`కోయిలమ్మ` సీరియల్‌ ఫేమ్‌ నటుడు సమీర్‌ అలియాస్‌ అమర్‌ పై కేసు నమోదైంది. ఆయనపై గురువారం హైదరాబాద్‌ రాయదుర్గంలోని పోలీస్‌ స్టేషన్‌ లైంగిక వేధింపుల కేసుని నమోదు చేవారు. తాగిన మత్తు మణికొండలో ఒంటరిగా ఉంటున్న ఇద్దరు అమ్మాయిలపై దౌర్జన్యానికి దిగాడని వారు ఆరోపిస్తూ పోలీసులకు ఫిర్యాదు చేశారు. `తాగిన మత్తులో సమీర్‌ మాతో అసభ్యంగా ప్రవర్తించాడు. అసభ్య పదజాలంతో రెచ్చిపోయాడు. రాత్రి తొమ్మిది గంటలకు మహిళ ఇంటికెళ్లి దౌర్జన్యం చేసి తమ దగ్గరున్న వస్తువులని లాక్కెళ్లి లైంగిక వేధింపులకు గురి చేశాడని మహిళ ఫిర్యాదు చేసింది. 

దీంతో సమీర్‌తోపాటు ముగ్గురు వ్యక్తులు, ఆయన ప్రియురాలు తమపై దాడి చేశారని బాధితులు పేర్కొన్నారు. శ్రీ విద్య అపర్ణలు కొద్ది రోజులుగా మణికొండలో బొటిక్‌ షాప్‌ని నిర్వహిస్తున్నారు. వారి దగ్గర నుంచి అయిదు లక్షల నగడు తీసుకున్నారు సమీర్‌. అవి అడిగితే రౌడీయిజం చేస్తున్నారని మహిళలు రాయదుర్గం పోలీసులను ఆశ్రయించారు. తమకి సమీర్‌ నుంచి ప్రాణహాని ఉందని తెలిపారు. దీంతో స్పందించిన పోలీసులు సమీర్‌పై ఎఫ్‌ఐఆర్‌ నమోదు చేశారని తెలిపారు. 

బుల్లితెరపై `కోయిలమ్మ` సీరియల్‌ బాగా ఆదరణ పొందుతుంది. ఇది ఇప్పటికే ఎనిమిది వందల ఎపిసోడ్‌ పూర్తి చేసుకుంది. ఈ సీరియల్‌ ద్వారా సమీర్‌కి మంచి గుర్తింపు వచ్చింది. ఈ సీరియల్ లో హీరోగా నటిస్తున్న సమీర్ తనకు వచ్చిన పాపులారిటీని ఇలా వాడుకుంటున్నాడు అని యువతులు ఆరోపించారు.