'ఖడ్గం' చిత్రంతో తెలుగు వారికి దగ్గరైన నటి కిమ్ శర్మపై తాజాగా పోలీసులు కేసు నమోదు చేశారు. ఐపిసి సెక్షన్ 323 - 504 కింద ఆమెపై కేసు నమోదు చేశారు. అసలు విషయంలోకి వస్తే.. కిమ్ శర్మ ఇంట్లో పని చేస్తోన్న పనమ్మాయి బట్టలు ఉతికే సమయంలో పొరపాటు తెల్ల దుస్తులను రంగుల బట్టలతో కలిపి ఉతకడంతో ఆ రంగు కాస్త తెలుపు దుస్తులకు అంటుకోవడంతో కిమ్ శర్మకు విపరీతమైన కోపం వచ్చేసింది. 

అప్పటికీ ఆ పనమ్మాయి తను చేసిన తప్పుని క్షమించమని అడిగినా.. కిమ్ తన కోపాన్ని కంట్రోల్ చేసుకోలేక ఆమెపై చేయి చేసుకుందట.. ఇంట్లో నుండి కూడా వెళ్లిపోమని చెప్పడంతో బాధితురాలు పోలీసులను ఆశ్రయించింది. తనకు రావాల్సిన నెలసరి జేతం ఇవ్వకుండా బయటకు పంపేశారని తనను కొట్టారనిపోలీస్ కంప్లైంట్ చేసింది. కేసు నమోదు చేసుకున్న పోలీసులు త్వరలోనే ఈ కేసును కోర్టుకి తీసుకువెళ్లబోతునట్లు వెల్లడించారు. 

ఈ షయంపై స్పందించిన కిమ్ శర్మ అసలు తను చేయి చేసుకున్నానని చెబుతున్న మాటల్లో నిజం లేదని, పనమ్మాయికి ఇవ్వాల్సిన డబ్బుని చెల్లించేశానని చెబుతోంది. తన విలువైన బట్టలు   పాడు చేసిన కారణంగానే ఆమెను పనిలో నుండి తీసేసినట్లు వెల్లడించింది.