నటుడు శరత్ కుమార్ పై మరో కేసు!

First Published 29, Jun 2018, 12:57 PM IST
case filed against sarath kumar
Highlights

కోలీవుడ్ హీరో శరత్ కుమార్ పై నడిగర్ సంఘం సభ్యులు పూచ్చి మురుగన్ చెన్నై పోలీస్ కమీషనర్ కు 

కోలీవుడ్ హీరో శరత్ కుమార్ పై నడిగర్ సంఘం సభ్యులు పూచ్చి మురుగన్ చెన్నై పోలీస్ కమీషనర్ కు ఫిర్యాదు చేశారు. నడిగర్ సంఘానికి సంబంధించిన కొన్ని భూములను శరత్ కుమార్, నటుడు రాధారవి అలానే మరో ఇద్దరు అక్రమంగా అమ్ముకొని సొమ్ము చేసుకున్నారనే ఆరోపణలతో పోలీసులు కేసు నమోదు చేసుకున్నారు.

గతంలో విశాల్ కూడా ఈ విషయంపై పోలీసులకు ఫిర్యాదు చేశారు. నడిగర్ సంఘం ఎన్నికల సమయంలో శరత్ కుమార్ పై పలు కేసులు నమోదు చేశారు. తాజాగా మరోసారి ఆయనపై కేసు నమోదైంది. నడిగర్ సంఘానికి అధ్యక్షడిగా ఉన్న సమయంలో ఆయన భారీ అక్రమాలకు పాల్పడ్డారని బాధితులు పోలీసులకు వెల్లడించారు.

తమిళనాడు అసెంబ్లీ ఎన్నికలు దగ్గరపడుతున్న సమయంలో శరత్ కుమార్ పై ఇటువంటి ఆరోపణలు రావడం ఇప్పుడు కోలీవుడ్ లో హాట్ టాపిక్ గా మారింది. కావాలనే ఆయన ఇమేజ్ ను దెబ్బ తీయాలని ఇటువంటి ఆరోపణలు చేస్తున్నారని ఆయన సన్నిహితులు వాపోతున్నారు. 
 

loader