బిగ్ బాస్2 పై కేసు నమోదు.. కష్టాల్లో హీరో!

case filed against bigg boss 2 tamil show
Highlights

ఇటీవల టెలికాస్ట్ అయిన ఒక ఎపిసోడ్ లో బిగ్ బాస్ హౌస్ లో కంటెస్టెంట్ ఒకరు నియంతగా వ్యవహరించాల్సి వచ్చింది. అయితే ఈ ఎపిసోడ్ గురించి మాట్లాడిన కమల్.. రాష్ట్రాన్ని నియంతలా పాలిస్తే నేతలకు ఎలాంటి గతి పడుతుందో అందరూ చూశారని అన్నారు.

కమల్ హాసన్ హోస్ట్ గా తమిళంలో 'బిగ్ బాస్' షో నిర్వహిస్తోన్న సంగతి తెలిసిందే. ప్రస్తుతం సీజన్ 2 షో నడుస్తోంది. అయితే ఈ రియాలిటీ షోపై తీవ్రమైన విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఈ షో మీదనే కాకుండా కమల్ హాసన్ పై కూడా పలు విమర్శలు చేస్తున్నారు. షోలో ఆయన కావాలనే కొన్ని అనుచిత వ్యాఖ్యలు చేస్తున్నారని చెన్నై నగర పోలీస్ కమీషనర్ కు ఫిర్యాదు చేశారు.

అసలు విషయంలోకి వస్తే.. ఇటీవల టెలికాస్ట్ అయిన ఒక ఎపిసోడ్ లో బిగ్ బాస్ హౌస్ లో కంటెస్టెంట్ ఒకరు నియంతగా వ్యవహరించాల్సి వచ్చింది. అయితే ఈ ఎపిసోడ్ గురించి మాట్లాడిన కమల్.. రాష్ట్రాన్ని నియంతలా పాలిస్తే నేతలకు ఎలాంటి గతి పడుతుందో అందరూ చూశారని అన్నారు. దివంగత ముఖ్యమంత్రి జయలలిత నియంతగా ఈ షోలో చూపించే ప్రయత్నం చేశారనే ఆరోపిస్తూ దీనిపై చర్యలు తీసుకోవాలని ఓ న్యాయవాది పోలీసులకు ఫిర్యాదు చేశారు. కమల్ హాసన్, బిగ్ బాస్ 2 షోలపై అలానే షో ప్రసారం చేస్తోన్న విజయ్ టీవీ ఛానెల్ పై చర్యలు తీసుకోవాలని ఫిర్యాదులో పేర్కొన్నారు. మరి ఈ వివాదం ఎక్కడ వరకు వెళ్తుందో చూడాలి!

loader