పోలీస్ కేసు: బాబు గోగినేని బయటకు వస్తాడా..?

case filed against babu gogineni, hyderabad police ready to investigate
Highlights

బాబు గోగినేని ఇప్పుడు బిగ్ బాస్ హౌస్ లో ఉండడంతో నిర్వాహకులకు నోటీసులు అందించి.. బాబు గోగినేనిని విచారించడానికి సిద్ధమవుతున్నారు. బిగ్ బాస్ హౌస్ లో ఉన్న రూల్స్ ప్రకారం హౌస్ లో ఉన్న వారిపై కేసు నమోదై, విచారణ చేయాల్సివస్తే.. కొన్ని షరతుల మీద పోలీసులు వారిని విచారించే అవాకాశం ఉంది

బిగ్ బాస్ సీజన్ 1 లో డ్రగ్స్ కేసులో ఇరుక్కున్న ముమైత్ ఖాన్ ను హౌస్ నుండి బయటకు తీసుకొచ్చి పోలీసులు విచారించిన సంగతి తెలిసిందే. ఇప్పుడు సీజన్ 2 లో బాబు గోగినేని పరిస్థితి కూడా అంతే అవుతుందా అనే సందేహాలు కలుగుతున్నాయి.

అసలు విషయంలోకి వస్తే.. దేశద్రోహం, మతాలు-కులాలు, వర్గాల పేరుతో ప్రజల్లో ద్వేష భావనలు రేకెత్తించడం, శాంతిని భగ్నపరచడం, అనుచిత్ర ప్రచారం చేయడం వంటి విషయాల్లో అతడిపై పోలీసు కేసు నమోదైంది. కేసు నమోదైన తరువాత ఇన్వెస్టిగేషన్ లో బాగా ఆలస్యం చేస్తున్నారని మరోసారి పిటిషనర్ కోర్టుని ఆశ్రయించారు. దీంతో ఈ నెల 25లోపు కేసు విషయంలో వివరణ ఇవ్వాలని కోర్టు ఆదేశించింది.

దీంతో పోలీసులు నోటీసులు ఇవ్వడానికి సిద్ధమయ్యారు. బాబు గోగినేని ఇప్పుడు బిగ్ బాస్ హౌస్ లో ఉండడంతో నిర్వాహకులకు నోటీసులు అందించి.. బాబు గోగినేనిని విచారించడానికి సిద్ధమవుతున్నారు. బిగ్ బాస్ హౌస్ లో ఉన్న రూల్స్ ప్రకారం హౌస్ లో ఉన్న వారిపై కేసు నమోదై, విచారణ చేయాల్సివస్తే.. కొన్ని షరతుల మీద పోలీసులు వారిని విచారించే అవాకాశం ఉంది. విచారణ పూర్తయిన తరువాత మళ్ళీ హౌస్ లోకి అనుమతిస్తారు. 

loader