మహిళతో అసభ్యకరంగా ప్రవర్తించిన నిర్మాత.. కేసు నమోదు!

First Published 28, Jun 2018, 12:05 PM IST
casa filed on tollywood producer
Highlights

ఓ మహిళతో అసభ్యకరంగా ప్రవర్తించిన కారణంగా టాలీవుడ్ కు చెందిన నిర్మాతపై కేసు నమోదు 

ఓ మహిళతో అసభ్యకరంగా ప్రవర్తించిన కారణంగా టాలీవుడ్ కు చెందిన నిర్మాతపై కేసు నమోదు చేశారు. నిర్మాత రమేష్ రెడ్డి గతంలో 'రాజా మీరు కేక' అనే సినిమాను నిర్మించారు. ఈ సినిమాకు కిషోర్ రెడ్డి దర్శకత్వం వహించగా రమేష్ రెడ్డి, రాజ్ కుమార్ లు నిర్మాతలుగా వ్యవహరించారు.

ఈ సినిమాకు పి.రవిరెడ్డి కెమెరామెన్ గా పని చేశారు. సినిమా షూటింగ్ సమయంలో నిర్మాత రమేష్ కెమెరామెన్ కు రెండు లక్షల రూపాయలు రెమ్యునరేషన్ గా ఇచ్చారు. ఆ తరువాత ఈ సినిమాకు నిర్మాతలుగా వ్యవహరించిన ఇద్దరి మధ్య మనస్పర్ధలు రావడంతో కెమెరామెన్ ను తను ఇచ్చిన రెమ్యునరేషన్ ను తిరిగి ఇచ్చేయాలని డిమాండ్ చేశాడట రమేష్ రెడ్డి. దానికి ఆయన అంగీకరించకపోవడంతో కెమెరామెన్ భార్యను దూషిస్తూ.. అసభ్యకర పదజాలంతో ఆమెను తిట్టినట్లు తెలుస్తోంది.

దీంతో ఆమె ఆ నిర్మాతపై పోలీసులకు ఫిర్యాదు చేసింది. కేసు నమోదు చేసుకున్న పోలీసులు విచారణ జరుపుతున్నారు. 

loader