ఇదే చిత్రాన్ని ప్ర‌స్తుతం త‌మిళంలో రీమేక్ చేస్తున్నారు, `కేరాఫ్ కాద‌ల్` పేరుతో రీమేక్ అవుతోంది. శ్రీ‌షిరిడీ సాయి ఫిలింస్‌, బిగ్ ప్రింట్ పిక్చ‌ర్స్‌, శ‌క్తి ఫిల్మ్ ఫ్యాక్ట‌రీ సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నాయి. ప్రేమ‌కు వ‌య‌సులేదు అనే క్యాప్ష‌న్‌తో రూపొందుతున్న ఈ చిత్రాన్ని హేమాంబ‌ర్ జాస్తి రూపొందిస్తున్నారు. క‌ల్పాతి ఎస్‌. అఘోరంకు చెందిన ఏజీఎస్ సంస్థ రిలీజ్ చేస్తున్న ఈ చిత్ర ట్రైల‌ర్‌ని ఎప్పుడో  రిలీజ్ చేశారు. కానీ ఈ నెల 12న ఈ సినిమా రిలీజ్ అవుతోంది. దాంతో ఈ ట్రైలర్ లైమ్ లైట్ లోకి వచ్చింది. ట్రైలర్ చూస్తే తెలుగు సినిమా ని యాజటీజ్ మక్కీకి మక్కి దింపేసారని అర్దమవుతోంది. తెలుగులో జోసెఫ్ పాత్ర చేసిన కార్తీక్ రత్నం, అలాగే మూగ ఆర్టిస్టుగా చేసిన నటుడు తమిళంలోనూ చేశారు.


రానా ఈ చిత్రంకు నిర్మాతగా వ్యవహరించడంతో అందరు కూడా ఈ చిత్రంపై ఆసక్తి చూపించారు. పెళ్లి చూపులు స్థాయిలో ఈ చిత్రం ఉంటుందని భావించారు. కాని కేరాఫ్ కంచరపాలెంకు ఆశించిన స్థాయిలో ఆధరణ దక్కలేదు. కమర్షియల్ గా కూడా ఎక్కువగా రాబట్టలేక పోయింది. విభిన్నమైన కథ.. కథనంతో తెరకెక్కిన 'కేరాఫ్ కంచరపాలెం' చిత్రం విమర్శకుల ప్రశంసలు మాత్రం దక్కించుకుంది.

తెలుగులో కమర్షియల్ గా అలరించలేక పోయిన 'కేరాఫ్ కంచరపాలెం' చిత్రంను తమిళం మరియు మలయాళంలో రీమేక్ చేస్తున్నారు నిర్మాత రాజశేఖర్ రెడ్డి. యమ్ .   సినిమా చూడగానే వెంటనే సురేష్ బాబు గారి వద్దకు వెళ్లి రీమేక్ రైట్స్ ను ఫ్యాన్సీ రేటుకు కొనుగోలు చేసినట్లుగా ఆయన పేర్కొన్నాడు. ప్రస్తుతం తమిళ రీమేక్కు రిలీజ్ కు రెడీ అయ్యందని.. మరో వైపు మలయాళం రీమేక్ కు సంబంధించిన ప్రీ ప్రొడక్షన్ వర్క్ జరుగుతుందని చెప్పుకొచ్చాడు.

తమిళం మరియు మలయాళంలో ఈ చిత్రం తప్పకుండా ఆకట్టుకుంటుందనే నమ్మకం నాకుందని.. మంచి సినిమాలు చేయాలనే ఉద్దేశ్యంతో పుట్టిన రోజు సందర్బంగా ఈ చిత్రంను చేస్తున్నట్లుగా చెప్పుకొచ్చాడు. పలు సినిమాలను అందించిన ఈయన కేరాఫ్ కంచరపాలెంతో అభిరుచి కలిగిన నిర్మాత అనే పేరు దక్కించుకునేందుకు ప్రయత్నిస్తున్నాడు. తెలుగులో అంతగా ఆకట్టుకోలేక పోయిన మన కంచరపాలెం అక్కడ ప్రేక్షకులను మెప్పిస్తుందో చూడాలి.