ఈ వారం కెప్టెన్సీ టాస్క్ లో అవినాష్‌ రెచ్చిపోయాడు. ఆరుగురు ప్యాసింజర్లని తన స్టేషన్‌కి చేర్చి కెప్టెన్‌ అయ్యాడు. ఆయన చేతిలో ఓడిపోయిన అరియానాని ఖుషీ చేస్తూ, ఇంటిసభ్యుల మన్ననలు పొందేలా రేషన్‌ మేనేజర్‌గా అరియానాని ఎంపిక చేశాడు. అయితే ఈ గేమ్‌ సాగే విషయంలో అవినాష్‌ చాలా సీరియస్‌ అయ్యాడు. ఎవరి గేమ్‌ వారు ఆడాలని, అటూ ఇటూ ఉండకూడదని ఇంటిసభ్యులపై ఫైర్‌ అయ్యాడు. 

ఇక కెప్టెన్‌ అయ్యాక కూడా ఊహించని విధంగా తన నిర్ణయాలు ప్రకటించిన సభ్యులను షాక్‌కి గురి చేశాడు అవినాష్‌. తాను కెప్టెన్‌గా ఉన్నంత వరకు ఎవరైనా మిస్టేక్స్ చేస్తే ఫనిష్‌మెంట్స్  ఉంటాయని ముందే కండీషన్స్ పెట్టాడు. అందులో భాగంగా ఈ వారంలో ఎవరైన మైక్‌ మర్చిపోతే వందసార్లు ఆ మైక్‌లో ఇక మైక్‌ మర్చిపోను అని వందసార్లు చెప్పాలన్నారు.  మధ్యలో నిద్రపోతే రెండు సార్టు స్విమ్మింగ్‌ ఫూల్‌లో దూకాలనే కండీషన్‌ పెట్టాడు. 

అంతటితో ఆగలేదు. ఈ వారం ఎవరైనా ఇంగ్లీష్‌లో మాట్లాడితే, చిన్న పిల్లాడిలా ప్రతి కెమెరా ముందుకు వెళ్ళి ఇక ఇంగ్లీష్‌లో మాట్లాడనని చెప్పాల్సి ఉంటుందని చెప్పాడు. ఇన్ని కండీషన్స్ పెట్టడంతో సభ్యులు షాక్‌కి గురయ్యారు. ఈ కండీషన్స్, ఫనిష్‌మెంట్స్ తనకి కూడా వర్తిస్థాయని పేర్కొన్నాడు.