Asianet News TeluguAsianet News Telugu

పదేళ్లకు.. మహేష్,పవన్ నిర్మాతలపై కేసు కొట్టివేత

గుర్తుందో లేదో పదేళ్ల క్రితం ఎన్నడూ లేని విధంగా తెలుగు సినీ పరిశ్రమలో మాఫియా వివాదం తలెత్తింది. 

C Kalyan and Singanamala ramesh Get Relief at CID court
Author
Hyderabad, First Published May 30, 2019, 4:04 PM IST

గుర్తుందో లేదో పదేళ్ల క్రితం ఎన్నడూ లేని విధంగా తెలుగు సినీ పరిశ్రమలో మాఫియా వివాదం తలెత్తింది. మహేష్ తో  ఖలేజా, పవన్ తో .. కొమరం పులి (2010) చిత్రాల నిర్మించిన సింనమల రమేష్ ఈ గొడవలో ఇరుక్కున్నారు. ఈ రెండు సినిమాలకు సి.కళ్యాణ్ ఎగ్జిక్యూటివ్ నిర్మాత . ఈ నిర్మాతలపై షాలిమర్ వీడియోస్ కంపెనీస్- యూనివర్శల్ హోమ్ ఎంటర్ టైన్ మెంట్ సంస్థలు ఓ డీల్ విషయంలో తలెత్తిన వివాదంపై సీఐడీ కోర్టు దాకా వెళ్లింది. రెండు ప్రముఖ వీడియో డిస్ట్రిబ్యూషన్ కంపెనీలతో సదరు నిర్మాతల వివాదం ఇన్నాళ్లూ నలుగుతూనే ఉంది.

నిర్మాత‌లు సింగ‌న‌మ‌ల ర‌మేష్ – సి.క‌ళ్యాణ్ కలిసి  భాను కిర‌ణ్ అనే గ్యాంగ్ స్ట‌ర్ పేరుతో బెదిరింపుల‌కు పాల్ప‌డ్డార‌ని.. త‌మ‌ని కొట్టి వేధించార‌ని ప్ర‌ముఖ ఆడియో-వీడియో కంపెనీలు షాలిమ‌ర్ .. యూనివ‌ర్శ‌ల్ హోమ్స్ ఆరోపించాయి. ఆ మేర‌కు సీఐడీ కోర్టుల ప‌రిధిలో కేసును విచారించారు  తాజాగా కోర్టులో తీర్పు వెలువ‌డింది. ఈ కేసు నుంచి సింగ‌న‌మ‌ల – సి.క‌ళ్యాణ్ ఇద్ద‌రికీ విముక్తి ల‌భించింది. 

ఆఖరి విచార‌ణ‌లో ఈ నిర్మాతలపై చేసిన ఆరోప‌ణ‌ల‌కు సంబంధించిన సాక్షాధారాల్ని ఇవ్వ‌డంలో డీవీడీ-వీసీడీ కంపెనీలు విఫ‌ల‌మ‌య్యాయ‌ని జ‌డ్జీలు తీర‌పును వెలువ‌రిస్తూ .. ఈ కేసును కొట్టివేశారు. భానుకిర‌ణ్ స‌మ‌క్షంలో సి.క‌ళ్యాణ్ త‌మ‌ని కొట్టారు అన్న‌దానికి షాలిమ‌ర్ – యూనివ‌ర్శ‌ల్ కంపెనీలు ఏమాత్రం ఆధారాల్ని చూపెట్ట‌లేక‌పోయాయ‌ని కోర్టు తీర్పు లో న్యాయ‌మూర్తులు ప్ర‌క‌టించారు. 

అప్ప‌టి గొడ‌వేంటి? 

2010లో రిలీజైన కొమ‌రం పులి, ఖ‌లేజా సినిమాల‌ భాక్సాఫీస్ వద్ద వర్కవుట్ కాలేదు. ఈ రెండు సినిమాలకు సంబంధించిన డీవీడీ-వీసీడీ హ‌క్కుల క్ర‌య‌విక్ర‌యాల్లో స‌ద‌రు డీవీడీ -వీసీడీ కంపెనీల‌తో నిర్మాత‌ల‌కు గొడవ వచ్చింది. ఖ‌లేజా, కొమ‌రం పులి సినిమాల‌కు స‌బంధించి డీవీడీ- వీసీడీ రైట్స్ ని ఒక్కొక్క‌టి 52.50 ల‌క్ష‌లు చొప్పున షాలిమ‌ర్ ..యూనివ‌ర్శ‌ల్ హోమ్స్ సంస్థ‌లు కొనుగోలు చేశాయి. ఆ మేర‌కు చెక్కులు చెల్లించాల్సి ఉండ‌గా వివాదం త‌లెత్తింది. దాంతో సింగ‌న‌మ‌ల‌- సిక‌ల్యాణ్ బృందం గ్యాంగ్ స్ట‌ర్ పేరుతో వేధించార‌ని సీఐడీ కోర్టులో కేసు వేశారు. మొత్తానికి ఈ కేసు  ఈరోజు తో వీగిపోయింది. ప‌దేళ్ల‌కు ఆ ఇద్ద‌రు నిర్మాత‌లకు క్లీన్ చిట్ వ‌చ్చింది.

Follow Us:
Download App:
  • android
  • ios