2024 సమ్మర్ కి షిఫ్ట్ అయిన సలార్?
సలార్ విడుదల వాయిదా పడిన విషయం తెలిసిందే. ఈ మేరకు చిత్ర యూనిట్ అధికారిక ప్రకటన చేశారు. అయితే కొత్త విడుదల తేదీ ప్రకటించలేదు. ఈ క్రమంలో అనేక ఊహాగానాలు తెరపైకి వస్తున్నాయి.

ప్రభాస్-ప్రశాంత్ నీల్ కాంబోలో తెరకెక్కుతుంది సలార్. ఈ భారీ పాన్ ఇండియా యాక్షన్ ఎంటర్టైనర్ పై ఇండియా వైడ్ అంచనాలున్నాయి. కెజిఎఫ్ డైరెక్టర్, బాహుబలి హీరో చేస్తున్న మూవీ కావడంతో హైప్ పీక్స్ కి చేరింది. సెప్టెంబర్ 28న సలార్ విడుదల కావాల్సి ఉండగా వాయిదా వేశారు. ఉన్నత ప్రమాణాలతో కూడిన మంచి సినిమా ప్రేక్షకులకు అందించాలనే ఉద్దేశంతో విడుదల ఆలశ్యమవుతున్నట్లు యూనిట్ వివరణ ఇచ్చారు.
ఇక సలార్ విఎఫ్ఎక్స్ వర్క్ పట్ల సంతృప్తి చెందని దర్శకుడు ప్రశాంత్ నీల్ సమయం తీసుకున్నారని అంటున్నారు. అలాగే మరికొన్ని వాదనలు తెరపైకి వచ్చాయి. రీజన్ ఏదైనా కానీ సలార్ అనుకున్న సమయానికి రావడం లేదు. మరి సలార్ విడుదల ఎప్పుడనే చర్చ జరుగుతుంది. ఈ క్రమంలో మూడు నాలుగు డేట్స్, సీజన్స్ తెరపైకి వచ్చాయి. సంక్రాంతికి సలార్ విడుదల చేయడం సబబు కాదు, నార్త్ ఇండియాలో అప్పుడు బిజినెస్ జరగదని అన్నారు. అందుకే నవంబర్, డిసెంబర్ నెలల్లో విడుదల ఉంటుందన్నారు.
తాజా సమాచారం ప్రకారం సలార్ డిస్ట్రిబ్యూటర్స్ కి విడుదల 2024లోనే అని చెప్పేశారట. దీంతో సలార్ సంక్రాంతి బరిలో ఉండొచ్చు అంటున్నారు. లేదు 2024 మార్చ్ కి ప్లాన్ చేశారు. సలార్ వచ్చే ఏడాది సమ్మర్ కి వస్తుందని అంటున్నారు. ఈ ఉహాగానాలు, వాదనలు ప్రభాస్ ఫ్యాన్స్ ని కంగారు పెడుతున్నాయి. సలార్ అవుట్ ఫుట్ పై నమ్మకం కుదిరినప్పుడే యూనిట్ విడుదల తేదీ ప్రకటిస్తారు. కాబట్టి ఎన్ని కథనాలు తెరపైకి వచ్చినా యూనిట్ స్పందించడం లేదు.
సలార్ మూవీలో ప్రభాస్ కి జంటగా శృతి హాసన్ నటిస్తుంది. పృథ్విరాజ్ సుకుమారన్, జగపతిబాబు కీలక రోల్స్ చేస్తున్నారు. సలార్ కూడా రెండు భాగాలుగా తెరకెక్కనుందనే ప్రచారం ఉంది. అలాగే ఇది కెజిఎఫ్ కథలో భాగమే అంటున్నారు. కాగా వరుస పరాజయాలతో ఇబ్బందిపడుతున్న ప్రభాస్ కమ్ బ్యాక్ కావాలని ఫ్యాన్స్ కోరుకుంటున్నారు.