నటుడు ఆది పినిశెట్టి తండ్రి కాబోతున్నాడు. ఆయన భార్య నిక్కీ గల్రాని గర్భవతి అయ్యారు. దీనిపై అధికారిక సమాచారం లేకున్నప్పటికీ ప్రచారం జరుగుతుంది. 

ఆది పినిశెట్టి ఈ ఏడాది ప్రేమ వివాహం చేసుకున్నారు. 2022 మే 18న నిక్కీ గల్రాని మెడలో ఆది తాళి కట్టారు. ఇరు కుటుంబాల పెద్దలను ఒప్పించి ఘనంగా పెళ్లి చేసుకున్నారు. కాగా నిక్కీ గల్రాని గర్భం దాల్చారన్న వార్త కోలీవుడ్ లో చక్కర్లు కొడుతుంది. దీనిపై ఎలాంటి అధికారిక సమాచారం లేదు. అయితే మీడియాలో కథనాలు వెలువడుతున్నాయి. 

సీనియర్ దర్శకుడు రవిరాజా పినిశెట్టి కుమారుడైన ఆది పినిశెట్టి ఒక విచిత్రం చిత్రంతో హీరోగా ఎంట్రీ ఇచ్చారు. ఆది తమిళంలో అధికంగా చిత్రాలు చేశారు. ఆది హీరోగా నటించిన హారర్ థ్రిల్లర్ వైశాలి మంచి విజయం సాధించింది. హీరోగా ఆదికి సరైన బ్రేక్ రాలేదు. దీంతో హీరోగా నటిస్తూనే విలన్, సపోర్టింగ్ రోల్స్ చేస్తున్నారు. 

సరైనోడు, అజ్ఞాతవాసి చిత్రాల్లో విలన్ రోల్ చేశారు. నిన్నుకోరి, రంగస్థలం చిత్రాల్లో ఆది సపోర్టింగ్ రోల్స్ చేశారు. రంగస్థలం మూవీలో ఆది రామ్ చరణ్ అన్నగా చేశారు. రంగస్థలం బ్లాక్ బస్టర్ హిట్ కొట్టిన నేపథ్యంలో ఆదికి మంచి బ్రేక్ వచ్చింది. ఇటీవల ఆది హీరోగా క్లాప్ టైటిల్ తో మూవీ విడుదలైంది. ఈ చిత్రం సైతం అనుకున్న స్థాయిలో ఆడలేదు.