రష్మిక మందాన హీరో నితిన్ మూవీ నుండి తప్పుకున్నట్లు వార్తలు వస్తున్నాయి. ఈ మేరకు టాలీవుడ్ లో ఓ న్యూస్ చక్కర్లు కొడుతుంది.  

నితిన్ హిట్ కొట్టి చాలా కాలం అవుతుంది. 2020లో విడుదలైన భీష్మ అనంతరం నితిన్ కి సక్సెస్ లేదు. ఈ ఏడాది మాచర్ల నియోజకవర్గం టైటిల్ తో మాస్ యాక్షన్ ఎంటర్టైనర్ చేశారు. ఇది కూడా నిరాశపరిచింది. దీంతో హిట్ ఇచ్చిన వెంకీ కుడుములతో మూవీ ఫిక్స్ చేశారు. వెంకీ కుడుముల-నితిన్-రష్మిక మందాన కాంబోలో మూవీపై అధికారిక ప్రకటన వచ్చింది. అట్టహాసంగా ప్రకటన ప్రోమో విడుదల చేశారు. 

మైత్రీ మూవీ మేకర్స్ నిర్మిస్తున్న ఈ చిత్రంపై భారీ అంచనాలు ఏర్పడ్డాయి. ఇక హిట్ ఖాయం అని ఫిక్స్ అయిన నితిన్ కి రష్మిక షాక్ ఇచ్చినట్లు ప్రచారం జరుగుతుంది. ఈ ప్రాజెక్ట్ నుండి రష్మిక తప్పుకున్నారట. డేట్స్ విషయంలో ఇబ్బంది తలెత్తిన నేపథ్యంలో ఈ ప్రాజెక్ట్ చేయలేనంటూ చెప్పేశారట. దీనిపై అధికారిక ప్రకటన లేకున్నప్పటికీ ప్రముఖంగా వినిపిస్తోంది. 

ప్రస్తుతం రష్మిక పుష్ప 2, యానిమల్ వంటి భారీ పాన్ ఇండియా చిత్రాల్లో నటిస్తున్నారు. అలాగే రైన్ బో టైటిల్ తో ఒక లేడీ ఓరియెంటెడ్ మూవీ చేస్తున్నారు. పుష్ప 2, యానిమల్ చిత్రాల చిత్రీకరణ చివరి దశకు చేరింది. నిజంగా డేట్స్ కుదరకే రష్మిక ప్రాజెక్ట్ వదిలేశారా? లేక ఇతర కారణాలు ఏమైనా ఉన్నాయా? అనే సందేహాలు మొదలయ్యాయి. 

మరోవైపు నితిన్ పొలిటికల్ ఎంట్రీ పై ఊహాగానాలు వినిపిస్తున్నాయి. తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలు దగ్గరపడ్డాయి. కాంగ్రెస్ పార్టీ తరపు నుండి ఆయన పోటీ చేస్తారట. నిజామాబాద్ కు చెందిన నితిన్ రూరల్ నియోజకవర్గం మీద కన్నేశాడట. ఆ సీటు ఆశిస్తున్నాడట. అక్కడి నుండి పోటీ చేయాలనేది నితిన్ ఆలోచనట. ఈ మేరకు రాజకీయ, సినీ వర్గాల్లో ఊహాగానాలు మొదలయ్యాయి. అటు సినిమా ఇటు రాజకీయాల్లో ఏక కాలంలో రాణించాలని అనుకుంటున్నాడట. అయితే ఇదంతా ఒట్టిదేనని ఒక వర్గం వాదన. ఆయన తన బంధువుల కోసం టికెట్ ప్రయత్నాల్లో ఉన్నాడని అంటున్నారు.