మరో రెండు రోజుల్లో ఎన్టీఆర్ బయోపిక్ రెండో భాగం 'మహానాయకుడు' రిలీజ్ కానుంది. కానీ ఆ హడావిడే కనిపించడం లేదు. ఇప్పటివరకు సినిమాకు సంబంధించిన ఒక్క ఈవెంట్ కూడా జరగలేదు. రోజుకొక పోస్టర్, ప్రోమో వదులుతూ సినిమా ప్రమోషన్స్ లైట్ తీసుకుంది చిత్రబృందం. దీంతో ఇప్పుడు బయ్యర్లలో ఆందోళన మొదలైంది.

'కథానాయకుడు' సినిమాకి వచ్చిన నష్టాలను ఈ సినిమా పూడుస్తుందని వారు భావిస్తున్నారు కానీ ఇప్పుడు పరిస్థితి అలా కనిపించక ఆందోళన చెందుతున్నారు. 'మహానాయకుడు' సినిమాకు మంచి ఓపెనింగ్స్ రాకపోతే బయ్యర్లు మళ్లీ నష్టాలు చవిచూడక తప్పదు. ఓపెనింగ్స్ భారీగా రావాలంటే సినిమా ప్రమోషన్స్ కూడా ఓ రేంజ్ లో ఉండాలి.

కానీ చిత్రబృందం కనీస జాగ్రత్తలు తీసుకోకపోవడంతో బయ్యర్లు అసహనం వ్యక్తం చేస్తున్నట్లు టాక్. 'కథానాయకుడు' సినిమాకి భారీగా ప్రమోషన్స్ చేస్తేనే ఓపెనింగ్స్ అంతంత మాత్రంగా ఉన్నాయి అలాంటిది ఇప్పుడు 'మహానాయకుడు' సినిమాకి అసలు ప్రమోషన్స్ లేకపోతే థియేటర్లు ఎలా నిండుతాయని బయ్యర్లు ఆందోళన చెందుతున్నారు. 

అయితే ఈ విషయంలో చిత్రబృందం ఆలోచన మాత్రం మరో రకంగా ఉంది. 'కథానాయకుడు' సినిమా ఆశించిన రేంజ్ లో ఆడలేదు కాబట్టి ఇప్పుడు రెండో భాగం గురించి ఏం చెప్పినా.. అది కాస్త ఓవర్ గా ఉంటుందని.. సినిమాకి మంచి టాక్ వస్తే అప్పుడు ప్రమోషన్స్ చేయాలని భావిస్తోంది. మరి సినిమాకి ఎలాంటి రిజల్ట్ వస్తుందో చూడాలి!