“బిజినెస్ మ్యాన్” రీ రిలీజ్ ప్లాన్! డిటేల్స్

డాషింగ్ డైరెక్టర్ పూరీ జగన్నాథ్ దర్శకత్వంలో తెరకెక్కిన యాక్షన్ ఎంటర్టైనర్ బిజినెస్ మ్యాన్. ఈ చిత్రం మహేష్ బాబు ను ఇండస్ట్రీ లో మరో లెవెల్ కి తీసుకెళ్లిన చిత్రం. మాస్ ఆడియెన్స్ ను ఈ సినిమా ఎంతో బాగా ఆకట్టుకుంది. 

BusinessMan Re-release for #MaheshBabu's birthday


ప్రస్తుతం టాలీవుడ్ లో రీ రిలీజ్ ట్రెండ్ తెగ నడుస్తోంది. ఇప్పటికే అనేక మంది  స్టార్ హీరోల చిత్రాలు రీ రిలీజ్ అయ్యి బాక్సాఫీస్ వద్ద భారీ వసూళ్లను రాబట్టడం జరిగింది. ఇప్పుడు మరోసారి మహేష్ వంతు వచ్చింది. ఇప్పుడు మహేష్ బాబు చిత్రం సైతం రీ రిలీజ్ కు రెడీ అయ్యంది. 

‘దూకుడు’ వంటి బ్లాక్ బస్టర్ మూవీ తర్వాత మహేష్ బాబు నుండీ వచ్చిన సూపర్ హిట్  చిత్రం ‘బిజినెస్ మెన్’. పూరి జగన్నాథ్ దర్శకత్వంలో ‘ఆర్.ఆర్ మూవీ మేకర్స్’ బ్యానర్ పై ఆర్.ఆర్.వెంకట్ ఈ చిత్రాన్ని నిర్మించారు. మహేష్ సరసన కాజల్ అగర్వాల్ హీరోయిన్ గా నటించగా తమన్ సంగీతం అందించాడు.ఓ రకంగా మహేష్ బాబు నెగిటివ్ రోల్ లాంటి డిఫరెంట్ పాత్ర ప్లే చేసిన మూవీ ఇది. సాధారణంగా ఓ స్టార్ హీరో ఇలా నెగిటివ్ డైమెన్షన్ కనిపిస్తే సినిమా హిట్ అవుతుంది అనే గ్యారెంటీ ఉండదు. కానీ ఇక్కడ ఎమోషన్ , కొత్తదనం రెండూ వర్కవుట్ అయ్యాయి. 2012వ సంవత్సరం జనవరి 13న విడుదలైన ఈ చిత్రం మంచి విజయాన్ని నమోదు చేసింది. 
 
డైలాగులతో సినిమాను తన భుజాలపై వేసుకుని నడపగలరని నమ్మిస్తూ... మహేష్ బాబు ను ఇండస్ట్రీ లో మరో లెవెల్ కి తీసుకెళ్లిన చిత్రం ఇది. మాస్ ఆడియెన్స్ ను ఈ సినిమా ఎంతో బాగా ఆకట్టుకుంది. ఈ సినిమా రీ రిలీజ్ కి రెడీ అవుతోంది. సూపర్ స్టార్ మహేష్ బాబు పుట్టిన రోజు (ఆగస్ట్ 9) సందర్భంగా గ్రాండ్ గా థియేటర్ల లో రీ రిలీజ్ కానుంది. ఈ చిత్రాన్ని నెక్ట్స్ లెవెల్లో గ్రాండ్ గా రీ రిలీజ్ చేయటానికి అభిమానులు సన్నాహాలు చేస్తుున్నారు.

మహేష్ నటన... మంచి ఈజ్ తో ఎప్పటిలాగే వన్ మ్యాన్ షో లాగ సినిమా మొత్తం తానే లాక్కెళ్లే ప్రయత్నం చేసాడు. అలాగే పూరీ డైలాగ్స్, 'సారొత్తారా.. 'పాట,'చావో పిల్ల..' పాటలు. ఇవి ఉన్నంతంలో సినిమాను చివరి వరకూ లాక్కెళ్లతాయి.  ఈ చిత్రం లో కాజల్ అగర్వాల్ హీరోయిన్ గా నటించగా, మ్యూజికల్ సెన్సేషన్ థమన్ సంగీతాన్ని అందించారు. 

Latest Videos
Follow Us:
Download App:
  • android
  • ios