కుర్ర హీరో ఆది సాయికుమార్, మిస్తీ చక్రవర్తి, నైరాషాలు హీరో హీరోయిన్లుగా నటించిన సినిమా 'బుర్రకథ'. ఈ సినిమా ప్రముఖ రచయిత డైమండ్ రత్నంబాబు దర్శకుడిగా పరిచయమవుతున్నారు.

ఇప్పటికే విడుదలైన ఈ సినిమా పోస్టర్లు, ట్రైలర్ లు సినిమాపై ఆసక్తిని పెంచేశాయి. అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకున్న ఈ సినిమాను శుక్రవారం నాడు విడుదల చేయడానికి ప్లాన్ చేశారు. కానీ ఇప్పుడు సినిమాను వాయిదా వేస్తున్నట్లు ప్రకటించారు.

సెన్సార్ సర్టిఫికేషన్ లో ఇబ్బందులు ఎదురవ్వడంతో సినిమా విడుదల వాయిదా పడింది. ఈరోజు కూడా సెన్సార్ పూర్తయ్యే ఛాన్స్ లేకపోవడంతో శనివారం నాటికి సినిమాను వాయిదా వేశారు.

అనుకున్న దానికంటే ఒకరోజు ఆలస్యంగా జూన్ 29న సినిమాను రిలీజ్ చేయడానికి ప్లాన్ చేస్తున్నారు. ఈ సినిమాపై ఆది ఎన్నో ఆశలు పెట్టుకున్నాడు. కచ్చితంగా సినిమా హిట్ అవుతుందని నమ్ముతున్నాడు. మరి ఈ సినిమా ఎలాంటి రిజల్ట్ ని అందుకుంటుందో చూడాలి!