దేశ భవిష్యత్తును మార్చే ఎన్నికల మొదటి అడుగు మొదలైంది. తొలి విడతలో భాగంగా ఆంధ్రప్రదేశ్ తెలంగాణ లో ఎన్నికలు జరుగుతున్న సంగతి తెలిసిందే. ఇక ఎప్పటి లానే సినీ తారలు వారి ఓటు హక్కును వినియోగించుకుంటున్నారు.
దేశ భవిష్యత్తును మార్చే ఎన్నికల మొదటి అడుగు మొదలైంది. తొలి విడతలో భాగంగా ఆంధ్రప్రదేశ్ తెలంగాణ లో ఎన్నికలు జరుగుతున్న సంగతి తెలిసిందే. ఇక ఎప్పటి లానే సినీ తారలు వారి ఓటు హక్కును వినియోగించుకుంటున్నారు ఇక స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ జూబ్లీ హిల్స్ లో తన ఓటును వేశారు.
ఈ రోజు చాలా ఇంపార్టెంట్ డే అంటూ.. అందరూ వారి ఓటు హక్కును వినియోగించుకోవాలని అన్నారు. మనం ఓటు వేస్తేనే ప్రశ్నించే హక్కు ఉంటుందని ఎవరు సమయాన్ని వృధా చేయకుండా బాధ్యతతో వ్యవహరించాలని అన్నారు. ఇక జూనియర్ ఎన్టీఆర్ కూడా తన తల్లి, భార్యతో కలిసి ఉదయాన్నే ఓటు వేశారు.
