స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్, స్టార్ డైరెక్టర్ త్రివిక్రమ్ కాంబినేషన్ రూపొందనున్న  సినిమా కథకు సంబంధించి ఓ లీక్ ఇప్పుడు  నెట్టింట్లో హల్ చల్ చేస్తోంది. అదేమిటంటే ఈ సినిమాలో బన్ని సాప్ట్ వేర్ ఇంజినీరు గా కనిపించనున్నారు. అదెలా తెలిసిందీ అంటే ఈ రోజు లీక్ అయిన ఫొటోలు నుంచి ఈ విషయం జనాలకు అర్దమైంది. వైట్ షర్ట్, బ్లూ ట్రౌజర్ లో బన్ని ఓ సాప్ట్ వేర్ ఇంజినీర్ లా కనపడ్డారు. అలాగే కార్పోరేట్ బాడ్జీ కూడా ఉంది. ఎమ్ ఎన్ సి కంపెనీ ఎంప్లాయిగా ఈ సినిమాలో కనపడబోతున్నాడని ఈ ఫొటోలు చూస్తే ఇట్టే అర్దమవుతుంది. ప్రస్తుతం త్రివిక్రమ్ ..రొమాంటిక్ సీన్స్ షూట్ చేస్తున్నారు. 

ఇక ఎప్పటిలాగే ఫన్ తో పాటు ఈ సారి త్రివిక్రమ్ తన తాజా చిత్రంలో చెల్లి సెంటిమెంట్ ని కథలో గట్టిగా స్ట్రెస్ చేస్తున్నట్లు తెలుస్తోంది. సినిమాలో సబ్ ప్లాట్ లా కాకుండా మెయిన్ కథనే చెల్లి చుట్టూ తిరిగేలా డిజైన్ చేసాడంటున్నారు.  ఈ మధ్యకాలంలో సిస్టర్ సెంటిమెంట్ కథలు ఎవరూ చేయలేదు కాబట్టి ఖచ్చితంగా వర్కవుట్ అవుతుందని నమ్ముతున్నాడట.
 
 ఈ సినిమాలో బన్నీ సరసన పూజా హెగ్డే హీరోయిన్ గా నటిస్తోంది. పూజా హెగ్డే ఇప్పటికే త్రివిక్రమ్ తో ‘అరవింద సమేత’కి, అలాగే అల్లు అర్జున్ తో డీజే సినిమాకి పనిచేసింది.

అల్లు అర్జున్ గతంలో త్రివిక్రమ్ దర్శకత్వంలో జులాయి, సన్నాఫ్ సత్యమూర్తి చిత్రాలు చేసారు. ఆ రెండింటికి భిన్నంగా ఈ సినిమా ఉండబోతోంది.   అలాగే  ఈ నేపథ్యంలో ఈ సినిమాకు 'అలకనంద' అనే పేరును టైటిల్ గా అనుకుంటున్నట్లు తెలుస్తోంది. 
 
గీత ఆర్ట్స్ మరియు యు హారిక అండ్ హాసిని క్రియేషన్స్ బ్యానర్ లు సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ చిత్రానికి తమన్ సంగీతాన్ని అందిస్తున్నారు.