యంగ్ హీరో బెల్లంకొండ శ్రీనివాస్ కెరీర్ ప్రారంభం నుంచీ స్టార్ డైరక్టర్, స్టార్  హీరోయిన్, భారీ బడ్జెట్ అన్నట్లుగానే సినిమాలు రూపొందుతున్నాయి. అయితే ఎంత ఖర్చు పెట్టినా అందులో సగం కూడా రాని పరిస్దితి. అయితే రెమ్యునేషన్స్ బాగుంటాయని డైరక్టర్స్, స్టార్ హీరోయిన్స్  చేయటానికి ముందుకు వస్తున్నారు. బెల్లంకొండ శ్రీనివాస్ కూడా బాగానే కష్టపడుతున్నాడు. 

కానీ బిజినెస్ విషయంలో బెల్లంకొండ సినిమాలు చాలా ఇబ్బందికరమైన పరిస్దితి ఎదుర్కొంటూండటంతో మొత్తానికి మీటింగ్ పెట్టుకుని, బడ్జెట్ కంట్రోల్ పెట్టకపోతే మునిగిపోతామనే నిర్ణయానికి వచ్చారని సమాచారం.  దాంతో తాజాగా రమేష్ వర్మ చేస్తున్న చిత్రాన్ని బెల్లంకొండ మార్కెట్ ని దృష్టిలో ఉంచుకుని.. మరీ సినిమాకి ఖర్చు పెడుతున్నారట. అంటే దాదాపు బడ్జెట్ విషయంలో భారి కోత పెడుతున్నారట. 

ఫిల్మ్ సర్కిల్స్  నుంచి అందుతున్న సమాచారం మేరకు... బెల్లంకొండ చెయ్యబోయే తాజా చిత్రం తమిళ రచ్చసన్ రీమేక్ రాక్షసుడు సినిమాకి  బడ్జెట్ లిమెట్ లో ఉండాలనే ఎగ్రిమెంట్ తో సినిమా మొదలెట్టారట. ఆ సినిమాకి కేవలం 15 కోట్లు బడ్జెట్ కేటాయించారట.   15 కోట్లలోనే  నటీనటుల పారితోషకాలు అన్ని అని చెప్పారట.  డైరక్టర్ అంత తక్కువలో చేయటం కష్టం అంటే.. మేము అలా అయితే సినిమా చేయటం కష్టమని చెప్పారట. 

ఎందుకంటే బెల్లంకొండకి  ఒక్కటి సరైన  హిట్ లేదు. అలాగే హీరోయిన్ గా చేస్తున్న అనుపమ వరుస ఫ్లాప్స్ తో ఉంది. ఇక  డైరక్టర్ రమేష్ వర్మ ఈ మధ్యకాలంలో ఒక్క హిట్ కూడా లేని దర్శకుడు. దానికి తగ్గట్లు సినిమా కూడా క్రైమ్ థ్రిల్లర్. ఏ మేరకు నడుస్తుందో తెలియదువీటికి తోడు  బెల్లంకొండ సినిమాలను కొనేందుకు డిస్ట్రిబ్యూటర్స్  ఉత్సాహంగా రావటం లేదు. . అవన్నీ ఆలోచించే  బడ్జెట్ ని కంట్రోల్ చేశారట. దాంతో  ఈసారి తక్కువ ధరలకే డిస్ట్రిబ్యూటర్స్ కి అమ్మాలనే ప్లాన్ లో రాక్షసుడు టీం ఉందని చెప్పుకుంటున్నారు. ఇది నిజమైతే బెల్లంకొండ ట్రాక్ లో పడినట్లే.