Asianet News TeluguAsianet News Telugu

‘తెలుగు ఇండియన్ ఐడల్ 2’ ఆడిషన్స్ లో బీఎస్ఎఫ్ జవాన్.. దేశభక్తి, సంగీతంపై అభిరుచి చాటుకున్న సోల్జర్!

‘తెలుగు ఇండియన్ ఐడల్’ సీజన్ -2  రేపటి  నుంచి ‘ఆహా’లో ప్రసారం కానుంది. రీసెంట్ గా  నిర్వహించిన ఆడిషన్స్ లో బీఎస్ఎఫ్ జవాన్ పాల్గొని సంగీతం, దేశభక్తి పట్ల తన అభిరుచిని చూపి జడ్జెస్ ను ఆకట్టుకున్నారు. 
 

BSF Jawan showed his Patriotism and Passion for Music at Telugu Indian Idol 2 Auditions
Author
First Published Mar 2, 2023, 2:57 PM IST

‘ఆహ’లో ప్రసారం కానున్న ‘తెలుగు ఇండియన్ ఐడల్’ సీజన్ -2కు సంబంధించిన ఆడిషన్స్ లో BSFజవాన్ తన దేశభక్తి, సంగీతం పట్ల అభిరుచిని చాటుకున్నారు. ఆయన గాత్రానికి  ఆడిషన్స్‌లో న్యాయమూర్తులు ఫిదా అయ్యారు.  భారతదేశం-పాకిస్తాన్ సరిహద్దులో పనిచేస్తున్న BSF జవాన్ చక్రపాణి (Chakrapani) ఇటీవల ఆహా నిర్వహించిన Telugu Indian Idol S2 ఆడిషన్స్ కు హాజరయ్యారు. ఈ సందర్భంగా సంగీతం పట్ల తనకున్న మక్కువను... తన దేశానికి సేవ చేయాలనే అంకితభావాన్ని ప్రదర్శించారు.

ఆడిషన్ సమయంలో చక్రపాణి మాట్లాడుతూ.. తనకు సంగీతంపై  పూర్వ జ్ఞానం లేదని, అయితే సరిహద్దులో డ్యూటీలో ఉన్నప్పుడు పాడటం నేర్చుకున్నానని  తెలిపారు. మొబైల్ నెట్‌వర్క్, ఇతర సౌకర్యాలకు ప్రాప్యత లేని మారుమూల ప్రదేశంలో పాడటం తనకు ఎలా సహాయపడిందనే దాని గురించి వివరించారు. సవాలక్ష పరిస్థితుల్లో సంగీతం నేర్చుకోవాలనే ఆయన అంకితభావం న్యాయనిర్ణేతలను, ప్రేక్షకులను ఆశ్చర్యానికి గురి చేసింది. ఆయన గాత్రం  కూడా చక్కగా  ఉండటంతో ఆడియెన్స్ కూడా ఫిదా అవుతున్నారు. 

ఇక న్యాయ నిర్ణేతలలో ఒకరైన ఎస్.ఎస్.థమన్ చక్రపాణి సంగీతానికి, దేశానికి చేసిన సేవకు మెచ్చుకున్నారు. మరోవైపు ప్రముఖ గాయకుడు కార్తీక్ కూడా చక్రపాణి ప్రతిభను అభినందిస్తూ ఆడియెషన్స్ లో సెలెక్ట్ చేస్తున్నట్టు అభిప్రాయాన్ని వ్యక్త పరిచారు. అయితే అందరినీ ఆశ్చర్యపరుస్తూ, చక్రపాణి ఆ ఆఫర్‌ను సున్నితంగా తిరస్కరించాడు. తనకు పెండింగ్‌లో ఎలాంటి సెలవులు లేవని, దేశానికి సేవ చేసేందుకు సరిహద్దులో తన విధులకు తిరిగి రావాల్సి వచ్చిందని వివరించారు. 

చక్రపాణి దేశభక్తి, కర్తవ్యం పట్ల ఆయనకున్న నిబద్ధతకు న్యాయమూర్తులు ఎంతగానో హత్తుకున్నారు. అతని నిస్వార్థతకు వారు లేచి నిలబడి అతనికి ధన్యవాదాలు తెలిపారు. తెలుగు ఇండియన్ ఐడల్ వేదికపైకి రక్షణ దళాల నుండి వచ్చి పాడటం తనకు ఎంతో గౌరవంగా అనిపించిందని S.S.థమన్ వ్యక్తం చేశారు. తనకిష్టమైతే ఉన్నతాధికారులతో మాట్టాడి షోలో పాల్గొనే అవకాశం కల్పించేందుకు ప్రయత్నిస్తామని కూడా తెలిపారు. ఈ సందర్భంగా Aha, తెలుగు ఇండియన్ ఐడల్ బృందం చక్రపాణి, మన దేశానికి అంకితభావంతో..  నిస్వార్థంతో సేవ చేస్తున్న సైనికులందరికీ వందనాలు తెలిపింది.  

 

Follow Us:
Download App:
  • android
  • ios